MLC Kavitha Bathukamma Celebrations At Nizamabad : బోధన్ పట్టణంలో బతుకమ్మ జోరు.. మహిళలతో కలిసి ఆడిపాడిన కవిత

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2023, 10:52 PM IST

thumbnail

MLC Kavitha Bathukamma Celebrations At Nizamabad : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించే బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. తీరొక్క పూలతో సేకరించిన బతుకమ్మలు చుట్టూ మహిళలు, ఆడపడుచులు సందడిగా ఆడిపాడుతున్నారు. నాల్గోరోజూ నానబియ్యం బతుకమ్మ సందర్భంగా నానబెట్టిన  బియ్యం, పాలు, బెల్లం నైవేద్యంగా ఇచ్చిపుచ్చికుంటున్నారు. ఇవాళ నిజామాబాద్‌ జిల్లా బోధ‌న్‌లో భార‌త జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌విత బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను జ‌రుపుకున్నారు. సంధ్యా సమయాన జూనియర్ కళాశాల మైదానంలో బతుకమ్మ సంబరాలలో.. ముస్లిం మ‌హిళ‌ల‌తో క‌విత బ‌తుక‌మ్మ వేడుక‌ల్లో పాల్గొన్నారు.

తోటి మహిళలతో కలిసి ఎంతో ఉల్లాసంగా బతుకమ్మ ఆడి సందడి చేశారు. ఈ ఉత్సవాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విస్తృతంగా పర్యటించారు. పట్టణంలోని పలు కుల సంఘాల నాయకుల ఇంట్లో బతుకమ్మను పేర్చి ఆడారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ అని అన్నారు. సంప్ర‌దాయ‌, సామ‌ర‌స్యం, ఇదే మ‌న తెలంగాణ అని క‌విత త‌న ఎక్స్​లో పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.