గిరిజనుడిపై మూత్ర విసర్జన.. బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణ చెప్పిన సీఎం

By

Published : Jul 6, 2023, 12:27 PM IST

Updated : Jul 6, 2023, 1:08 PM IST

thumbnail

Madhya Pradesh Urination Incident : మధ్యప్రదేశ్‌లో ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ విచారం వ్యక్తం చేశారు. రాజధాని భోపాల్​లోని తన నివాసానికి బాధితుడ్ని పిలిపించుకుని కాళ్లు కడిగి క్షమాపణ కోరారు. బాధితుడు దశరథ్ రావత్​ను కుర్చీపై కూర్చోబెట్టి, తాను కిందే కూర్చోని.. నీళ్లతో అతడి కాళ్లు కడిగారు. దశరథ్ రావత్​ను సన్మానించి, స్నేహితుడిగా సంభోదిస్తూ.. సరదాగా కాసేపు ముచ్చటించారు. 

వివిధ అంశాలపై​ రావత్​తో చర్చించిన చౌహాన్​.. అతనికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నారు. అంతకుముందు ఇద్దరు కలిసి స్మార్ట్​ సిటీ పార్క్​లో ఓ మొక్కను కూడా నాటారు. ముఖ్యమంత్రితో సమావేశమైన అనంతరం.. దశరథ్ రావత్​ మీడియాతో మాట్లాడాడు. తాను ముఖ్యమంత్రిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన కుటుంబ సభ్యులను కూడా ముఖ్యమంత్రి పిలిపించారని.. వారితో సైతం మాట్లాడారని రావత్​ వెల్లడించాడు.  

సీధీ జిల్లాలో 3 నెలల క్రితం దశరథ్ రావత్​పై ప్రవేశ్ శుక్లా మూత్రం పోయగా.. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఇటీవల వైరల్‌ కావడం వల్ల మధ్యప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. దీంతో ప్రవేశ్‌ శుక్లాను అరెస్టు చేసి.. జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అతడి ఇంటిని కూడా బుల్డోజర్‌తో నేలమట్టం చేశారు.

Last Updated : Jul 6, 2023, 1:08 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.