Water Release from Saraswathi Pumphouse : సరస్వతి పంపుహౌస్ నుంచి కాళేశ్వరం జలాల ఎత్తిపోతలు షురూ

By

Published : Jul 5, 2023, 4:01 PM IST

thumbnail

Kaleshwaram Water Release from Saraswathi Pumphouse : వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు వద్ద నిర్మించిన సరస్వతి పంపుహౌస్​లో 4 మోటార్ల ద్వారా పార్వతి బ్యారేజ్​లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. రెండు రోజుల క్రితం రెండు మోటార్ల ద్వారా ప్రారంభమైన నీటి ఎత్తిపోత.. జల ప్రవాహం పెరగడంతో క్రమంగా నాలుగు మోటార్లకు చేరుకుంది. ప్రస్తుతం 4 మోటార్లు రన్​ చేస్తూ... 8 పైపుల ద్వారా నీటిని పార్వతి బ్యారేజ్​లోకి ఎత్తిపోస్తున్నారు. పార్వతి బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 8.83 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.71 టీఎంసీల నీరు ఇందులో నిల్వ ఉంది. బ్యారేజ్ నీటి నిల్వ సామర్థ్యం 130.00 మీటర్లు ఉండగా ప్రస్తుతం 126.99 మీటర్ల మేర నీరు ఉంది. ఈ క్రమంలో సరస్వతి పంపుహౌస్ నుంచి 4 మోటార్ల ద్వారా 11,724 వేల క్యూసెక్కుల నీటిని పార్వతి బ్యారేజ్​లోకి ఎత్తిపోస్తున్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.