ETV Bharat / spiritual

ఆ రాశివారు అన్ని రంగాల్లో రాణిస్తారు - కానీ దూకుడు తగ్గించుకుంటే మేలు! - Daily Horoscope In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 5:00 AM IST

Horoscope Today May 17th 2024 : మే​ 17న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
Daily Horoscope In Telugu (ETV Bharat)

Horoscope Today May 17th 2024 : మే​ 17న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సంతానం పురోగతి పట్ల శ్రద్ధ వహిస్తారు. చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో పనిచేసి అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులు బిజినెస్ పనుల మీద ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. పలు మార్గాల ద్వారా ఆదాయం వృద్ధి చెందుతుంది. స్థిరాస్తి రంగం వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ సృజనాత్మకతకు ఈ రోజు పట్టం కడతారు. తిరుగులేని ప్రతిభతో, కష్టించి పనిచేసి మీ తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. మిమ్మల్ని చూసి మీ తోటి ఉద్యోగులు ఉత్తేజితులవుతారు. మీ నేతృత్వంలో పనిచేసేందుకు సిద్ధమవుతారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వారు మీకు సాయపడతారు. ఈ రోజు మీకు అత్యంత ఫలదాయకమైన రోజు. మీరు చేస్తున్న పనులలో చక్కని పురోగతిని చూస్తారు. ఆర్ధికంగా అత్యంత ఫలవంతమైన రోజు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం మీకు భవిష్యత్​లో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు ఆశించిన ప్రయోజనాలను అందుకుంటారు. శ్రమకు తగిన ఫలం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అదనపు ఆదాయ మార్గాల కోసం ప్రయత్నిస్తారు. శివారాధన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపార రంగాల వారికి చేపట్టిన పనుల్లో సానుకూలత ఉండదు. ఆర్ధిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మానసికంగా ఆందోళనతో ఉంటారు. వ్యాపారులకు రుణభారం పెరుగుతుంది. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రకాల వృత్తి వ్యాపార రంగాల వారికి చేసే ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. మీ సమర్థతను నమ్మి ఆత్మ విశ్వాసంతో పని చేస్తే, తిరుగులేని విజయాలను సాధిస్తారు. దృఢసంకల్పం, ప్రశాంత చిత్తంతో మీరు అత్యంత కఠినమైన పనులను కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ ఛాన్స్​తో పాటు జీతం పెరుగుదల కూడా ఉంటుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉండదు. అన్ని రంగాల వారు ఈ రోజు వ్యతిరేక ఫలితాలనే చూడనున్నారు. మీ మొండితనం, ఉద్రేకపూరిత స్వభావం కారణంగా ఎంతో నష్ట పోతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో దూకుడు తగ్గించుకొని నిదానంగా వ్యవహరిస్తే మేలు. ఆత్మవిశ్వాసం మంచిదే కానీ మితిమీరిన ఆత్మవిశ్వాసం స్నేహితులను దూరం చేస్తుంది. వ్యాపారులకు వ్యాపారంలో నష్టాలు ఏర్పడవచ్చు. అయితే కొంచెం లౌక్యంగా వ్యవహరిస్తే నష్టాల నుంచి బయటపడవచ్చు. ఆంజనేయస్వామిని ప్రార్థిస్తే ఆపదలు తొలగుతాయి.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వివిధ రంగాల్లో విజయాలతో పాటు మీ ఆదాయంలో కూడా వృద్ధి ఉంటుంది. ఇది మీలో సంతోషాన్ని, సంతృప్తిని నింపుతుంది. స్నేహితులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. స్థిరాస్తి రంగం వారు మంచి లాభాలను అందుకుంటారు. గణపతి ఆరాధన శ్రేయస్కరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టం వరిస్తుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి ఈ రోజు చక్కని అదృష్టం,సానుకూల ఫలితాలు ఉంటాయి. మీ పని మీ ఉన్నతాధికారులకు సంతృప్తి కలిగిస్తుంది. సామాజిక గుర్తింపు, పదోన్నతి లభించే సూచనలున్నాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తీవ్రమైన అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యాపారులు పోటీదారుల కారణంగా వ్యాపారంలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఉద్యోగులకు పని ప్రదేశంలో అనుకూలత ఉండదు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వైద్య చికిత్స నిమిత్తం ధనవ్యయం ఉంటుంది. ఆదిత్య హృదయం పఠిస్తే ఆరోగ్యం కుదుట పడుతుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఊహించని ఖర్చులు ఎదురవడంతో డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతుంది. ముఖ్యంగా అనారోగ్యం కారణంగా వైద్య ఖర్చులు పెరిగిపోతాయి. ప్రతికూల ఆలోచనలను వీడండి. కల్తీ ఆహారం కారణంగా ఆరోగ్యం పాడవుతుంది. వ్యాపారులు వ్యాపారంలో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితం లేక నిరాశకు లోనవుతారు. శని స్తోత్రాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అత్యంత శుభకరంగా ఉంటుంది. ఈ రోజు అంతా ఆనందం, ఉత్సాహంతో నిండి ఉంటుంది. మీ పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిసికట్టుగా అద్భుతాలు సృష్టిస్తాయి. అన్ని పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేసారు. నూతన వస్త్రాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశముంది. బంధు, మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు. ఆర్ధిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. గృహంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. ఉద్యోగులకు పని ప్రదేశంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని, దూకుడును అదుపులో ఉంచుకుంటే వివాదాలు రాకుండా ఉంటాయి. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.