పట్టాలపై ఆవు.. 'వందే భారత్​'కు తప్పిన ముప్పు.. రైలు దిగి, దగ్గరుండి పక్కకు తోలి..

By

Published : Jun 27, 2023, 2:08 PM IST

thumbnail

ట్రయల్​ రన్​లో భాగంగా పట్నా నుంచి రాంచీ వెళ్తున్న వందేభారత్ ఎక్స్​ప్రెస్​కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఓ ఆవు బర్నక్నా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపైకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన లోకో పైలెట్​ చాకచక్యంగా వ్యవహరించి బ్రేకులు వేసి రైలును ఆపాడు. రైలును ఆపకపోతే ఆవు మరణించడం సహా ప్రారంభోత్సవానికి ముందే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ముందు భాగం దెబ్బతినేది. ఆ ముప్పు తప్పినందున అధికారులు అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.  రైలు పట్టాలపై తిరుగుతున్న ఆవును వెంటనే రైల్వే సిబ్బంది అక్కడ నుంచి పక్కకు పంపారు. ట్రయల్ రన్​ సమయంలో ఈ వందే భారత్ ఎక్స్​ప్రెస్ రైలులో నలుగురు రైల్వే సిబ్బంది మాత్రమే ఉన్నారు.  

కాగా.. ప్రధాని మోదీ.. రాంచీ-పట్నా వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ రైలును భోపాల్​లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు మొదటి మూడు రోజుల ట్రయల్ రన్ విజయవంతంగా ముగిసింది. ఆఖరి రోజు ఆవు రైలుకు అడ్డంగా వచ్చినా.. లోకో పైలెట్ చాకచక్యంతో ప్రమాదం తప్పింది. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.