ETV Bharat / bharat

మీ హ్యాండ్‌ బ్యాగులో ఈ వస్తువులు ఉన్నాయా ? లేదా ? ఒకసారి చెక్ చేసుకోండి! - what to put in your handbag

author img

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 10:17 AM IST

What To Keep In Your Handbag : ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు చాలా మంది మహిళలు తప్పకుండా హ్యాండ్‌ బ్యాగ్‌ క్యారీ చేస్తారు. అయితే.. కొన్నిసార్లు ఇందులో అత్యవసరమైన వస్తువులను పెట్టుకోవడం మర్చిపోయి ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్‌ మీరు ఫేస్‌ చేయకూడదంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే!

Handbag
What To Keep In Your Handbag (ETV Bharat)

What To Keep In Your Handbag : మహిళలు ఎక్కడికెళ్లినా చేతిలో బ్యాగ్‌ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇందులో ఉండే కొన్నిరకాల వస్తువులు వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే.. ప్రతి మహిళా తమ హ్యాండ్‌ బ్యాగులో కొన్ని వస్తువులను ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి అత్యవసర సమయంలో ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేస్తున్నారు. ఇంతకీ హ్యాండ్‌ బ్యాగ్‌లో ఉండాల్సిన వస్తువులు ఏంటో మీకు తెలుసా ? ఇప్పుడు చూద్దాం.

వాటర్ బాటిల్ :
మీ హ్యాండ్‌ బ్యాగ్‌లో ఎప్పుడూ ఒక వాటర్‌ బాటిల్‌ ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా ఎండాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు బాటిల్‌ కచ్చితంగా ఉండాలి. మీకు దాహంగా ఉన్నప్పుడు ఎక్కడైనా, ఎప్పుడైనా ఈజీగా నీళ్లను తాగొచ్చు.

స్నాక్స్ :
హ్యాండ్‌ బ్యాగులో ఎప్పుడూ కూడా ఒక బిస్కెట్‌ ప్యాకెట్‌, ఏవైనా స్నాక్స్‌, హెల్దీ నట్స్‌ ఉండేలా చూసుకోండి. కొన్నిసార్లు ఇంటికి రావడం ఆలస్యం అయితే మధ్యలో ఎక్కడైనా స్నాక్స్‌ తినొచ్చు.

డైలీ ఈ ఫేస్‌ప్యాక్‌లు ట్రై చేశారంటే- మేకప్‌ లేకుండానే మెరిసిపోవచ్చు! - natural face mask for glowing skin

పర్సు :
మనం ఇంటినుంచి బయట అడుగుపెట్టేటప్పుడు హ్యాండ్ బ్యాగులో పర్సు ఉందా? లేదా? అనేది చెక్‌ చేసుకోవాలి. ఎందుకంటే దాదాపు పర్సులోనే డబ్బులు, ఏటీఎమ్‌ కార్డ్‌, క్రెడిట్‌ కార్డ్ వంటివి ఉంటాయి. పర్సు మర్చిపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఇంటి తాళం :
కొంతమంది ఆఫీస్‌కు టైమ్‌ అవుతుందనే కంగారులో ఇంటికి తాళం వేసి ఎక్కడోచోట పెడుతుంటారు. అయితే, ఇలా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంటి తాళాన్ని హ్యాండ్‌ బ్యాగులో పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే.. టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదని సూచిస్తున్నారు.

మాస్క్ :
ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా కాలుష్యం ఎక్కువగానే ఉంది. వాహనాల నుంచి వచ్చే కలుషితమైన గాలి పీల్చడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, తప్పనిసరిగా మీ హ్యాండ్‌ బ్యాగులో మాస్క్‌లు ఉండేలా చూసుకోండి. మీరు బస్సులో లేదా ఆటో ప్రయాణించేటప్పుడు మాస్క్‌ ధరించడం వల్ల మీరు సేఫ్‌గా ఉండొచ్చు.

మొబైల్ ఛార్జర్ :
నేటి ఆధునిక ప్రపంచంలో మొబైల్‌ మన జీవితంలో భాగం అయిపోయింది. ఏది మరిచిపోయినా దీన్ని మరిచిపోయే అవకాశం ఉండదు. అయితే.. ఛార్జింగ్ సమస్య ఎదురు కాకుండా ఛార్జర్ ఎల్లప్పుడూ బ్యాగులో పెట్టుకోండి.

ఫస్ట్ ఎయిడ్ కిట్ :
ఎల్లప్పుడూ మీ హ్యండ్‌ బ్యాగులో కొన్ని అత్యవసరమైన మందులు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ వంటి వాటిని పెట్టుకోండి. ఇవి మీకు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు.

పుస్తకాలు చదవడం :
పుస్తకాలు చదవడం అనేది ఒక మంచి అలవాటు. అయితే, మీరు ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు లేదా ఎక్కడికైనా జర్నీ చేస్తున్నప్పుడు ఒక మంచి పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, మీ హ్యాండ్‌ బ్యాగులో మీకు ఇష్టమైన ఒక పుస్తకాన్ని పెట్టుకోండి.

అలర్ట్ : సమ్మర్​లో ఫ్రిజ్​ పేలిపోయే ఛాన్స్​ ఎక్కువా? - ఎందుకిలా జరుగుతుంది? - Refrigerator Maintenance Tips

ఒక్క చెంచా తేనెతో ఎంతో మేలు- సమ్మర్​లో హనీ ఎందుకు తీసుకోవాలో తెలుసా? - Honey Usage In Summer

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.