ETV Bharat / health

ఎంతటి మొటిమలైనా ఈ టిప్స్​ పాటిస్తే క్లియర్​​! మీరూ ట్రై చేస్తారా? - Tips to Prevent Acne Problems

author img

By ETV Bharat Telangana Team

Published : May 12, 2024, 2:32 PM IST

Tips to Prevent Acne Problems: సౌందర్యపరంగా అమ్మాయిలను, అబ్బాయిలను ఇబ్బందిపెట్టే ప్రధాన సమస్యలో మొటిమలు ఒకటి. వీటిని తగ్గించుకోవడానికి చాలా మంది ఎన్నో విధలుగా ట్రై చేస్తారు. కానీ కొన్నిసార్లు ఎటువంటి ఫలితం ఉండదు. అలాంటి వారు ఎటువంటి టెన్షన్స్​ లేకుండా ఈ టిప్స్​ పాటించారంటే రిజల్ట్​ మీరే నమ్మలేరంటున్నారు నిపుణులు!

Tips to Avoid Pimples
How to Get Rid from Pimples (ETV Bharat)

Tips to Avoid Pimples: అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య.. పింపుల్స్. అయితే ఈ మొటిమలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. అంటే.. కొందరిలో చిన్న సైజ్​లో కనిపిస్తూ తక్కువ సంఖ్యలో ఉంటే.. ఇంకొందరిలో పెద్ద సైజ్​లో ఉంటూ ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. ఒక్కసారి ఇవి వచ్చాయంటే ఫేస్ మొత్తం అందవిహీనంగా మారుతుంది. దాంతో నలుగురితో కలిసి బయటకు వెళ్లలేని పరిస్థితి.

ఇక ఈ క్రమంలోనే చాలా మంది వీటిని తగ్గించుకోవడానికి ఏవేవో ఫేస్ ఫ్యాక్​లు, క్రీమ్స్, వంటింటి చిట్కాలు ట్రై చేస్తుంటారు. ఇక కొందరైతే డాక్టర్​ను కలిసి మందులు కూడా వాడుతుంటారు. ఇలా చేయడం ద్వారా కొందరిలో మార్పు కనిపిస్తే.. మరికొంతమందిలో ఎలాంటి మార్పు కనిపించకపోగా మరింత ఎక్కువ అవుతాయి. అలాంటి వారు ఈ టిప్స్​ పాటిస్తే ప్రాబ్లమ్​ సాల్వ్​ అంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

  • మొటిమలు ఎక్కువగా జిడ్డు చర్మం ఉన్న వ్యక్తులలో రావడం సాధారణం. రోజుకు రెండు సార్లు ముఖం కడుక్కోవడం వల్ల చర్మంపై జిడ్డు, మురికి, మృత చర్మ కణాలు తొలగిపోతాయి. ఇది రోమాలు మూసుకుపోకుండా, బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తుంది. తద్వారా మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది. 2016లో Journal of Dermatological Treatment లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం రోజుకు రెండు సార్లు ముఖం కడుక్కున్న వారిలో మొటిమల తీవ్రత గణనీయంగా తగ్గినట్లు కనుగొన్నారు. ఈ అధ్యయనంలో 100 మందిని 8 వారాల పాటు పరిశీలించారు. ఇక ఈ పరిశోధనలో న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో చర్మవ్యాధి నిపుణుడు డా. డేవిడ్ పి. యాంగ్ పాల్గొన్నారు. రోజుకు రెండు సార్లు ముఖం కడుక్కోవడం.. మొటిమల తీవ్రతను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేసిందని పేర్కొన్నారు.

మొటిమలు తగ్గాలంటే క్రీమ్స్​ పూయడం కాదు తిండి మార్చుకోవాలి - ఈ డైట్​తో ఆల్ క్లియర్! - Anti Acne Food Diet

  • చాలా మంది ఎక్కువ గాఢత కలిగిన సబ్బులను వాడుతుంటారు.అయితే ఆ కఠిన మైన సబ్బులు కూడా చర్మాన్ని చికాకు పరుస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి మృదువైన సబ్బులతో పాటు మృదువైన టవల్​లను వినియోగించాలని సూచిస్తున్నారు.
  • కొందరైతే చేతులను ఎక్కడ పడితే అక్కడి పెట్టి.. మళ్లీ అవే హ్యాండ్స్​తో ముఖాన్ని తాకుతుంటారు. ఇలా చేయడం ద్వారా కూడా మొటిమలు తగ్గవు. ఎందుకంటే మన చేతికున్న బ్యాక్టీరియా ముఖంపైకి చేరుతుంది. మొటిమలతో అప్పటికే ఉబ్బి ఉన్న ముఖం మరింత చికాకు పెడుతుంది. కాబట్టి హ్యాండ్స్ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఫేస్​ను పదే పదే తాకకుండా చూసుకోవాలి.
  • మొటిమలు వచ్చినప్పుడు చాలా మంది వాటిని గిల్లుతుంటారు. అలా చేయడం మంచిది కాదంటున్నారు. ఎందుకంటే చర్మంపై ఉండే బ్యాక్టీరియా లోపలికి వెళ్లి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు ఈ అలవాటు మానే ప్రయత్నం చేయాలి.
  • అమ్మాయిలు ముఖ్యంగా మేకప్ వేసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మొటిమలు ఉన్నప్పుడు ఫౌండేషన్, పౌడర్ అద్దుకోవద్దని అంటున్నారు. ఒక వేళ తప్పనిసరి పరిస్థితులలో వేసుకుంటే రాత్రిపూట పూర్తిగా క్లీన్​ చేసుకోవాలని సూచిస్తున్నారు.
  • తలస్నానం చేసే ముందు చాలా మంది తలకు నూనె అప్లై చేసుకుంటారు. కానీ ఇలా ఎప్పుడూ చేయొద్దని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే తలస్నానం చేసే ముందు నూనె పెట్టుకుంటే ఇది ముఖం మీదకి వ్యాపించి, చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుందని.. తద్వారా మొటిమలు వస్తాయని అంటున్నారు.
  • తినే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వేపుళ్లు, కొవ్వు పదార్థాలు తగ్గించాలని.. తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు. పాల ఉత్పత్తులు, చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్స్​ వంటివి తినొద్దని చెబుతున్నారు.

NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఎంత ట్రై చేసినా ఫేస్​పై మొటిమలు తగ్గట్లేదా? - అయితే ఓసారి ఇవి ట్రై చేసి చూడండి!

మొటిమలు, నల్ల మచ్చలు వేధిస్తున్నాయా? - ఇలా ఈజీగా పోగొట్టండి!

మొటిమల సమస్య - ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్​కు వెళ్లాలి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.