కాంగ్రెస్​ ప్లీనరీ సమావేశాలు.. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఎజెండా

By

Published : Feb 24, 2023, 9:53 PM IST

thumbnail

Congress plenary meetings: ఒకవైపు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రతో అందించిన ఉత్సాహం.. మరోవైపు సవాల్ విసురుతున్న 2024 సార్వత్రిక ఎన్నికలు.. ఈ రెండింటి మధ్యనే శతాధిక కాంగ్రెస్‌ పార్టీలో కీలకమైన ప్లీనరీ సమావేశాలు ఇవాళ ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో 15వేల మంది ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారని కాంగ్రెస్‌ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం. అయితే.. అంతా ఎదురు చూస్తున్నట్లు.. 2024 ఎన్నికలకు రోడ్‌మ్యాప్‌, పొత్తులు, ఇతర సర్దుబాట్ల అంశాలు పార్టీ వ్యూహ ప్రణాళికలు ఇక్కడే సిద్ధం అవుతాయా? మరోసారి గెలుపు మీద కన్నేసిన బీజేపీని బలంగా ఎదుర్కోవడంలో కాంగ్రెస్‌ అధిగమించాల్సిన సవాళ్లేమిటి? ఇదే అంశంపై ఈటీవీ భారత్​ స్పెషల్​ డిబెట్​. 

ఛత్తీస్​గఢ్​లో ప్రారంభమైన ప్లీనరీ సమవేశాలు: కాంగ్రెస్‌ 85వ ప్లీనరీ సమావేశాలు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇందుకు ఆ పార్టీ అగ్రనాయకులతోపాటు సుమారు 15వేల మంది ప్రతినిధులు హాజరు అవుతున్నట్లు కాంగ్రెస్​ తెలిపింది. తొలిరోజు జరిగిన స్టీరింగ్‌ కమిటీ సమావేశానికి కాంగ్రెస్​ సీనియార్​ నాయకురాలు సోనియా, రాహుల్‌ గాంధీలు దూరంగా ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతోన్న కాంగ్రెస్‌.. తాజా ప్లీనరీ సమావేశాల్లో వాటిపై కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుతం జరుగుతున్న ప్లీనరీలో భాగంగా పార్టీ స్టీరింగ్‌ కమిటీ ఈ ఉదయం సమావేశమైంది. సీడబ్ల్యూసీ సభ్యులను పార్టీ అధ్యక్షుడే ఎన్నుకునేలా నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.  

సీడబ్ల్యూసీ ఎంపిక పార్టీ అధ్యక్షుడి చేతిలో..: కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశమైన ఈ స్టీరింగ్‌ కమిటీ.. మూడు రోజుల సమావేశాల అజెండాకు తొలుత ఆమోదం తెలిపింది. మొదట ప్రారంభోపన్యాసం చేసిన ఖర్గే.. సీడబ్ల్యూసీ ఎన్నిక నిర్వహించడంపై సభ్యులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలపాలని నేతలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం సభ్యులు దీనిపై భిన్నాభిప్రాయలు వ్యక్త పరిచారు. అయినప్పటికీ సీడబ్ల్యూసీ సభ్యులను పార్టీ అధ్యక్షుడు నామినేట్‌ చేసేలా స్టీరింగ్‌ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు కాంగ్రెస్​ పార్టీ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌ పేర్కొన్నారు.  

ప్లీనరీ సమావేశాలు ఫలించేనా: ఈ ఏడాది చివర్లో ఛత్తీస్​గఢ్​లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న తరణంలో ఈ ప్లీనరీ నిర్వహించడం ద్వారా.. ఆ రాష్ట్రంతో పాటు, ఇరుగుపొరుగు రాష్ట్రాలైనా మధ్యప్రదేశ్‌, తెలంగాణల్లో పార్టీ శ్రేణులను ఉత్తేజపరచవచ్చని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.