A Boy Falls Off School Building In Nirmal : ప్రమాదవశాత్తు పాఠశాల భవనం రెండో అంతస్తు నుంచి పడిపోయిన విద్యార్థి..

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2023, 2:00 PM IST

thumbnail

A Boy Falls  Off School Building In Nirmal : నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్​లో గల మేధ మోడల్ స్కూల్​లో ప్రమాదవశాత్తు రెండో అంతస్తు నుంచి విద్యార్థి జారిపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. సారంగాపూర్ మండలం బీరవెల్లి  గ్రామానికి చెందిన విద్యార్థి ఈశ్వర్ నిర్మల్​లోని మేద మోడల్ స్కూల్​లో ఆరో తరగతి చదువుతున్నాడు. ఉదయం ఎప్పటిలాగే పాఠశాలకు వచ్చాడు. పాఠశాలలోని రెండో అంతస్తులో  తరగతి ఉండగా తోటి విద్యార్థులతో కలిసి తరగతి గదికి వెళుతుండగా ప్రమాదవశాత్తు రెండో అంతస్తు నుంచి కిందికి జారిపడ్డాడు.

ఈ ఘటనలో దవడకు, కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. దీంతో అక్కడ పని చేస్తున్న పాఠశాల సిబ్బంది గమనించి హుటాహుటిన చికిత్స నిమిత్తం స్థానిక శ్రీ ఆదిత్య ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి తల్లి దండ్రులకు ఈ విషయం తెలియడంతో వారు కూడా హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొన్నారు. విద్యార్థికి శస్త్ర చికిత్స చేశామని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.