Prathidwani: విద్యార్జనకు ఆటంకం కాని విశ్వాసాలపై వివాదం ఎందుకు?

By

Published : Feb 11, 2022, 10:24 PM IST

Updated : Feb 3, 2023, 8:11 PM IST

thumbnail

విద్యార్థులు దేశ భవిష్యత్తు నిర్మాతలు. సామరస్యానికి, సాంస్కృతిక వైవిధ్యానికి ఆలవాలమైన ఈ దేశంలో మతంపేరుతో, సంస్కృతి పేరుతో వైషమ్యాలు రగిలించే ప్రయత్నాలు చోటుచేసుకుంటున్నాయి. యూనిఫాం, ధార్మిక వస్త్రధారణ విషయంలో చినికిచినికి గాలివానగా మారిన వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకూ వ్యక్తిగత విశ్వాసాలు పాటించడంపై అభ్యంతరాలు ఉండరాదన్న ప్రజాస్వామిక విలువలకు ప్రమాదం ఏర్పడుతోంది. భారతీయ సమాజంలోని బహుళత్వం, సమ్మిళితత్వానికి విఘాతం కలిగించే చర్యలు మితిమీరుతున్నాయి. ఈ పరిణామాలు దేనికి సంకేతం? ఇప్పుడు పౌర సమాజం పాటించాల్సిన సంయమనం ఏంటి? ఇదే అంశంపై ఈటీవీ భారత్​ ప్రతిధ్వని.

Last Updated : Feb 3, 2023, 8:11 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.