ఆర్మీ సహాయక చర్యల్లో హెలికాప్టర్​ నుంచి జారిపడ్డ యువకుడు

By

Published : Apr 11, 2022, 7:14 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

thumbnail

ఝార్ఖండ్​లోని త్రికూట్ పర్వతాల్లో జరుగుతున్న సహాయక చర్యల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఒక పర్యటకుడు హెలికాప్టర్​ ఎక్కుతూ జారిపడ్డాడు. ఈ ఘటనలో పర్యటకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. దీంతో ఇప్పటివరకు ఇద్దరు మరణించినట్లు అధికారులు తెలిపారు. 32 మందిని రక్షించామని.. మరో 15 మంది పర్యటకులు చిక్కుకున్నారని ఝార్ఖండ్ పర్యటక శాఖ మంత్రి హఫీజుల్​ హసన్​ తెలిపారు. ఎన్​డీఆర్ఎఫ్​, ఆర్మీ సహాయక చర్యలు చేపడుతున్నాయని.. దీనిపై విచారణ జరుపుతామని ఆయన చెప్పారు. ఆదివారం ఈ ఘటన జరిగిన సమయంలో రోప్​వేకు సంబంధించిన 19 కేబుల్ కార్లలో 70 మంది పర్యటకులు చిక్కుకుపోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఎన్​ఢీఆర్​ఎఫ్​ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రోప్​వేలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు వాయుసేన రంగంలోకి దిగింది. రెండు ఎంఐ-17 హిలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టారు. కొందరిని కేబుల్ కార్లలో నుంచి బయటకు తీశారు. వెలుతురు సరిగా లేని కారణం ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. మంగళవారం ఉదయం తిరిగి పునరుద్ధరిస్తారు. ప్రమాదానికి సంబంధించి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దేవ్​ఘర్​లోని సదర్ ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.