ETV Bharat / sukhibhava

Vegetarian Tips Protein : వెజిటేరియన్ డైట్ పాటిస్తున్నారా? పోషకాలన్నీ అందాలంటే ఎలా?

author img

By

Published : Aug 18, 2023, 10:10 AM IST

Vegetarian Tips Protein : శాకాహారంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే శాకాహారం తీసుకునే వాళ్లలో ప్రోటీన్లు ఉండవనే అభిప్రాయం అధికంగా ఉంటుంది. అందుకోసమే వీళ్లు పోషకాల లోపానికి గురికాకుండా చూసుకోవాలి. ఈ నేపథ్యంలోనే శాకాహారులు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

tips for vegetarian diets for weight loss
వెజిటేరియన్ డైట్

Vegetarian Tips Protein : మన ఆరోగ్యాన్ని కాపాడే అంశాల్లో మొదటిది ఆహారం. సరైన ఆహారం తీసుకునే అలవాటు ఉంటే అనేక అనార్యోగాలను నివారించే శక్తిని పెంచుకున్నట్లే. శాకాహారంతో అనేక అనారోగ్యాలను నివారించే అవకాశం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే పూర్తిగా శాకాహారమే తీసుకునేవారు పోషకాహార లోపం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి శాకాహారాలు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Vegetarians Precautions in Telugu : శాకాహారం అనేది ఎంతో ఆరోగ్యకరమైనదని చెబుతుంటారు. అయితే మాంసాహారం స్థాయిలో వీటిలో ప్రోటీన్లు ఉండవనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. శాకాహారులు గింజలు, చిక్కుళ్లు, విత్తనాలు, పప్పులు, ధాన్యాలు లాంటి భిన్నమైన ఆహారాలనే తీసుకున్నట్లయితే ప్రోటీన్లతో పాటు అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. మాంసాహారానికి బదులుగా తాము ఎలాంటి ఆహారాలు తీసుకుంటే పోషకాలు లభిస్తాయో శాకాహారులకు తెలిసి ఉండాలి.

Vegetarian Protein Sources for Muscle Building : చిక్కుళ్లు, కూరగాయలు, క్యారెట్లు, పుట్టగొడుగులు, పాలకూరలు వంటి భిన్నమైన ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. గుడ్లు తినేవారు ప్రోటీన్ కోసం వాటిని తీసుకోవచ్చు. ధాన్యాలు, పప్పులు, పళ్లు, కాయగూరలు వంటి ఆహారాల ద్వారా శాకాహారులు తమకు అవసరమైన క్యాలరీలను, పోషకాలను పొందొచ్చు. శాకాహారుల్లో కొందరు పాలు, గుడ్లను తింటారు. వీటిని తీసుకునేవారికి దాదాపు మాంసాహారులతో సమానంగా పోషకాలు లభించే అవకాశం ఉంటుంది. శాకాహారులు తాము తీసుకునే ఆహారంలో పోషకాల లోపం లేకుండా చూసుకోవాలి.

'శాకాహారుల్లో ల్యాక్టో వెజిటేరియన్, ఓవో వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్, వీగన్స్.. ఇలా పలు రకాల వారు ఉన్నారు. ల్యాక్టో వెజిటేరియన్స్ పాల ఉత్పత్తుల్లో తమకు నచ్చినవి తీసుకుంటారు. ఓవో వెజిటేరియన్స్ గుడ్లు తింటారు. వీగన్స్ మాత్రం కేవలం మొక్కల నుంచి ఉత్పత్తి అయ్యే కూరగాయలు, ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. వీళ్లు పాల ఉత్పత్తులు కూడా తీసుకోరు. శాకాహారులు తమ డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, పోషకాలు శరీరానికి అందేలా చూడాలి' అని ప్రముఖ డైటీషియన్ డాక్టర్ శ్రావ్య చెప్పుకొచ్చారు.

వాటికి దూరంగా ఉండండి
Vegetarian Diet Avoid : ల్యాక్టో వెజిటేరియన్స్ పాల ఉత్పత్తులు, పన్నీర్ లాంటివి తీసుకుంటే ఎక్కువ మోతాదులో కాల్షియం, ప్రొటీన్స్ లభిస్తాయని డాక్టర్ శ్రావ్య అన్నారు. గుడ్లు ఎక్కువగా తీసుకుంటూ, పాల ఉత్పత్తులను దూరం పెట్టే ఓవో వెజిటేరియన్స్ మాత్రం అన్ని రకాల కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే పండ్లను తరచూ తింటూ ఉండాలని సూచించారు. ఇలా చేయడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని డాక్టర్ శ్రావ్య పేర్కొన్నారు.

శాకాహారంతో బరువు తగ్గడమే కాకుండా ఎక్కువ కాలం జీవిస్తారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మాంసాహారులతో పోలిస్తే శాకాహారుల్లో కొలెస్ట్రాల్ స్థాయులు తక్కువగా ఉన్నాయని, వీరికి మధుమేహం, రక్తపోటు వచ్చే ఛాన్స్ కూడా తక్కువేనని అధ్యయనాల ద్వారా తేలింది. శాకాహారులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.

పండ్లు, కూరగాయలు, ముడిధాన్యాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు మన ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పుష్కలంగా లభిస్తాయి. శాకాహారంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చని పలు అధ్యయనాల్లో రుజువైంది. మాంసాహారం తినేవారు కూడా దాన్ని తగ్గించడం వల్ల స్థూలకాయం, టైప్-2 మధుమేహం, అధిక రక్తపోటు వంటివి తగ్గుతాయి.

వీటిని తరచూ తీసుకోండి
'ఎవరైతే వెజిటేరియన్ డైట్ పాటిస్తున్నారో వాళ్లు తమ ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలను చేర్చుకోవాలి. విటమిన్ డీ, కాల్షియం, ప్రొటీన్లను శరీరానికి అందేలా చూసుకోవాలి. నట్స్ ఎక్కువగా తింటూ ఉండాలి. అలాగే విటమిన్ సీ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, తులసి లాంటి వాటిని కూడా తీసుకుంటూ ఉండాలి. దీని వల్ల వర్షకాలంలో ఇన్ఫెక్షన్ల బారి నుంచి తప్పించుకోవచ్చు' అని డాక్టర్ శ్రావ్య సూచించారు.

ఇవి అస్సలు తినొద్దు
శాకాహారులు తాము తీసుకునే ఆహారం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. శాకాహారమే కదా అని నూనెలు ఎక్కువగా వాడిన పదార్థాలు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి తింటే ప్రమాదమే. శాకాహారం ద్వారా లాభం పొందాలంటే ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ప్రొటీన్ మన శరీరంలో అనేక రకాల పనుల్ని నిర్వర్తిస్తుంది. అందుకే ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు తమ ఆహారంలో నట్స్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. భిన్నమైన శాకాహార ప్రోటీన్లను తినడం మంచిది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఆరోగ్యకరమైన శాకాహారం తీసుకోవాలంటే చక్కెరతో తయారైన ఆహారాలు, తీపి పదార్థాలు, శుద్ధి చేసిన ధాన్యాలు లాంటివి తీసుకోవడం తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పండ్ల రసాలకు బదులుగా పండ్లనే తినాలని అంటున్నారు. మొక్కల ద్వారా లభించే ఆహారాలను తీసుకుంటూ పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు. అవసరమైతే వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్లను తీసుకోవాలని సూచిస్తున్నారు.

వెజిటేరియన్ డైట్ పాటిస్తున్నారా

చికెన్​లోనే కాదు.. ఈ వెజ్​ ఐటమ్స్​లోనూ ఫుల్​ ప్రోటీన్స్​!

మీరు వెజిటేరియనా?.. మరి ఈ ఆహార పదార్థాలను తీసుకుంటున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.