ETV Bharat / sukhibhava

80 ఏళ్ల వయసులోనూ పురుషుల్లో ఆ కోరికలు ఎందుకొస్తాయి?

author img

By

Published : Dec 22, 2021, 8:30 AM IST

Sexuality in Older Age: 70-80 ఏళ్ల వయసొచ్చినా చాలా మంది పురుషుల్లో శృంగారంపై ఆసక్తి తగ్గదు. మహిళల్లో మాత్రం ఇలా ఉండదు. అసలు ఇలా జరగడానికి కారణం ఏమిటి?. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..?

couple
జంట

Sexuality in Older Age: 80 ఏళ్ల వయసులోనూ చాలా మంది పురుషులు శృంగారంలో యాక్టివ్​గా ఉంటారు. మహిళల్లో మాత్రం ఇలా జరగదు. దీనికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నిపుణుల మాట..

స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయినట్లుగా పురుషుల్లో టెస్టోస్టిరాన్ కణాల సంఖ్య తగ్గిపోదు. 100 ఏళ్లొచ్చినా.. వారిలో ఈ కణాలు ఉంటాయి. టెస్టోస్టిరాన్.. మగవారిలో సెక్స్​ పరంగా చక్కటి ప్రేరణ కల్పించే హార్మోన్. ఈ కారణంగానే పురుషుల్లో శృంగార వాంఛ అస్సలు తగ్గదు. సెక్స్​ కోరికలకు వయసుతో అసలు సంబంధమే లేదని నిపుణుల చెబుతున్నారు.

మైండ్​ ప్రశాంతంగా ఉంటే..

మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయమం చేయడం, మానసికంగా ఉల్లాసంగా ఉండటం చాలా ముఖ్యం. ఎలాంటి ఒత్తిడి, డిప్రెషన్​ వంటి సమస్యలు లేని పురుషులు రొమాంటిక్​గా ఉంటారు. వారి మైండ్ వైబ్రంట్​గా ఉంటుంది. మెదడు చురుగ్గా ఉంటే సెక్స్​పై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

ముసలివాడిని అయిపోయా.. ఇంకేం కోరికలు ఉంటాయిలే! అని పురుషుడు భావిస్తే.. కోరికలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అసలు వృద్ధాప్యం గురించే ఆలోచించకుండా సెక్స్​ పరంగా వచ్చే స్పందనలను ఆనందిస్తే.. వారు లైవ్​లీగా ఉంటారని అంటున్నారు. సెక్స్​ విషయంలో యంగ్​గానే ఉంటారని చెబుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:

ఆయుష్షు పెరగాలంటే.. 'శృంగారం' తప్పనిసరి

Sex Positive Education: అలా సెక్స్​ చేస్తే.. పిల్లలు పుట్టరా?

రతిలో ఎక్కువ తృప్తి పొందేది ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.