ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: యాదాద్రి ఆలయంలో దర్శనాలు నిలిపివేత

author img

By

Published : Mar 20, 2020, 9:43 AM IST

Updated : Mar 20, 2020, 9:55 AM IST

కరోనా ప్రభావంతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ఇవాళ్టి నుంచి దర్శనం నిలిపేస్తున్నట్లు అధికారుల ప్రకటించారు. భక్తులు సహకరించాలని కోరారు.

Yadadri Lakshminarasimha Swamy temple closed
కరోనా ఎఫెక్ట్​: యాదాద్రి ఆలయంలో దర్శనం నిలిపివేత

రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా వైరస్​ వ్యాప్తి పెరగడం వల్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి సూచనలతో పలు ప్రముఖ ఆలయాల్లో పూజ సేవలను రద్దు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనాలను ఇవాళ్టి నుంచి నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

కరోనా ఎఫెక్ట్​: యాదాద్రి ఆలయంలో దర్శనం నిలిపివేత

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భక్తులను ఆలయంలోకి అనుమతించమని అధికారులు తెలిపారు. నేటి నుంచి స్వామి వారికి ఏకాంత సేవలో నిత్య కైంకర్యాలు నిర్వహిస్తామని ప్రకటించారు. భక్తులు లేక ఆలయ పరిసరాలన్ని నిర్మానుష్యంగా మారాయి. కొండపైన ఉన్న భక్తులను క్రిందికి వెళ్లాలని సూచిస్తున్నారు. పైకి వెళ్లకుండా కొండ కిందద ఘాటురోడ్డు వద్ద నిలిపేస్తున్నారు.

ఇదీ చూడండి: 'కరోనాపై యుద్ధం కోసం.. వచ్చే ఆదివారం జనతా కర్ఫ్యూ'

Last Updated : Mar 20, 2020, 9:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.