ETV Bharat / state

వంటగ్యాస్​ సిలిండర్​లో నీళ్లు... అవాక్కైన మహిళ

author img

By

Published : Jul 8, 2020, 3:28 PM IST

Updated : Jul 8, 2020, 5:45 PM IST

Water-filled LPG cylinders reported
వంటగ్యాస్​ సిలిండర్​లో నీళ్లు... అవాక్కయిన వినియోగదారు

వంట గ్యాస్​ సిలిండర్​లో గ్యాస్‌కు బదులుగా నీటిని నింపారు. సిలిండర్​ కొనుగోలు చేసిన వారానికే గ్యాస్​ అయిపోవడంతో ఓ మహిళ పరిశీలించగా అసలు విషయం బయట పడింది. ఈ ఘటన మోత్కూరు మండలం పాలడుగులో వెలుగుచూసింది.

ఎల్పీజీ గ్యాస్​ సిలిండర్​లో నీళ్లు నింపి వినియోగదారులకు సరఫరా చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా పాలడుగులో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ మహిళ గత నెల 30న ఆత్మకూరులోని ఇండియన్‌ గ్యాస్‌ ఏజెన్సీలో సిలిండర్‌ కొనుగోలు చేసింది. వారం రోజులకే మంట రావడం ఆగిపోవడం వల్ల.... పరిశీలించగా సిలిండర్‌ నుంచి నీరు బయటపడింది. సుమారు 21.7 కిలోల నీళ్లు ఉన్నాయి.

ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించగా.... సిలిండర్ లీకేజీలు పరీక్షించే సమయంలో నీటిని వినియోగిస్తారని... ఆ సమయంలో సిలిండర్‌లోకి నీరు చేరి ఉండొచ్చని తెలిపారు.

వంటగ్యాస్​ సిలిండర్​లో నీళ్లు... అవాక్కైన మహిళ

ఇవీచూడండి: ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ

Last Updated :Jul 8, 2020, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.