ETV Bharat / state

Maize Procurement Problems in TS : దగాపడ్డ రైతు.. పంటను అమ్ముకోవడానికి ఇన్ని తిప్పలా..!

author img

By

Published : May 22, 2023, 7:17 AM IST

Farmers suffering without buying crop
Farmers suffering without buying crop

Maize Procurement Problems in Telangana : కష్టపడి పంట పండించిన రైతుకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. పంటను అమ్ముకోవాలంటే కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ సంచులు, కాంటాల కోసం పడిగాపులు పడాల్సి వస్తోంది. ఇక మిల్లుకు తీసుకొచ్చిన పంటను దిగుమతి చేయడం కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లరు దిగుమతి చేసుకోలేదంటూ.. మహబూబాబాద్‌ జిల్లాలో ఓ రైతు ఆవేదనతో ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టాడు.

కష్టపడి పంట పండించిన రైతుకు అడుగడుగునా అవాంతరాలు

Maize Procurement Problems in Telangana : అన్నదాతకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మక్క రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. మార్క్ ఫెడ్ కేంద్రాల ద్వారా మక్కలు కొనుగోలు చేసేందుకు ఇటీవలే ప్రభుత్వం కేంద్రాలు ప్రారంభించినా.. మక్కల సేకరణ మాత్రం అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఖమ్మం జిల్లాలో 60 వేల మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాలో 19 వేల మెట్రిక్ టన్నులు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొంది. అయితే ఇప్పటి వరకు కేవలం దాదాపు 6 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు.

Maize Procurement Issues in Telangana : కేంద్రాల్లో కాంటాలు సాగక రైతులు పడిగాపులు కాస్తున్నారు. గన్నీ సంచుల కొరత, సకాలంలో లారీలు రాకపోవడంతో కాంటాలు పూర్తయినప్పటికీ నిరీక్షణ తప్పడం లేదు. హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ వ్యాప్తంగా వరి పంటను అత్యధిక విస్తీర్ణంలో సాగు చేశారు. దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో సంతోషంగా రైతులు కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద మద్దతు ధరకు అమ్ముకోవాలంటే రైతులు చుక్కలు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

తేమ, తాలు పేరుతో అడుగడుగునా రైతును దగా చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాల కోసం ఎదురుచూసిన రైతులకు.. కాంటాలు అయిన తర్వాత మిల్లు దగ్గరికి వస్తే అక్కడ తిప్పలు తప్పడం లేదు. కిలోమీటర్ల మేర వాహనాల్లో సరుకు దిగుమతి కాక రోజుల తరబడి ఎదురు చూడవలసిన పరిస్థితి నెలకొంది. ధాన్యం బస్తాలను దిగుమతి చేసుకోకపోవడంతో ఓ రైతు ఆందోళనకు దిగాడు. తీసుకొచ్చిన ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం పెద్దనాగారంలోని ఓ రైసు మిల్లు వద్ద చోటు చేసుకుంది.

Paddy procurement centers : చిన్నగూడూర్ మండలం విస్సంపల్లికి చెందిన రైతు భాను ప్రకాష్.. తను సాగు చేసిన మూడేకరాల పొలంలో పండిన ధాన్యాన్ని గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. అనంతరం బస్తాలను ట్రాక్టర్‌లో పెద్దనాగారంలోని రైస్ మిల్లుకు ఈనెల 19న తీసుకొని వచ్చారు. మిల్లు నిర్వాహకులు ధాన్యం బస్తాలను దిగుమతి చేసుకోలేదు. విస్సంపల్లి కేంద్రం తమకు కేటాయించలేదని చెప్పారు.

దీంతో రైతు తిరిగి కేంద్రానికి వెళ్లి నిర్వాహకులకు విషయాన్ని చెప్పగా.. వారు అదే మిల్లుకు వెళ్లాలని చెబుతూ ట్రక్ షీట్ చూపారు. దీంతో రైతు మిల్లు వద్దకు వెళ్లి బస్తాలను దిగుమతి చేసుకోవాలని ప్రాధేయ పడ్డారు. నిర్వాహకులు దిగుమతి చేసుకోకపోవడంతోపాటు.. దూషించడంతో రైతు ఆవేదనకు గురై ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మిల్లు సిబ్బంది వెంటనే స్పందించి బస్తాలకు పెట్టిన నిప్పును అర్పేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.