ETV Bharat / state

Sisters Tie Rakhi to Jawan Statue : సైన్యంలో వీరమరణం పొందిన జవాన్.. 9 ఏళ్లుగా విగ్రహానికి రాఖీ కడుతున్న చెల్లెళ్లు

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2023, 2:06 PM IST

Sisters Tie Rakhi to Jawan Statue : ఒక కొమ్మన పూచిన పూవుల్లాంటి అన్నా చెళ్లెల్లు, అక్కా తమ్ముల్లు ఆనందంతో జరుపుకునేది రాఖీ వేడుక. ఆత్మీయ సోదరులకు బొట్టుపెట్టి, హారతులిచ్చి, మిఠాయిలు తినిపించి ఎల్లవేళలా తమకు రక్షగా ఉండాలని ఆడపడుచులు రక్షాబంధనం కడితే.. వారి కష్ట సుఖాల్లో అండగా ఉంటానని సోదరులు నిండు మనస్సుతో ఆశీర్వదించే పండుగే రాఖీ. కానీ ఉన్న ఒక్కగానొక్క సహోదరుడు సైన్యంలో చేరి వీరమరణం పొందగా.. సోదరుని సమాధి వద్ద తన ప్రతిరూపంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి ప్రతి ఏటా రాఖీలు కడుతూ తమ ప్రేమానురాగాన్ని చాటుతున్నారు ఆ అక్కాచెల్లెళ్లు.

Rakhi Purnima
Sisters Tie Rakhi to Jawan Brother Statue

Sisters Tie Rakhi to Jawan Statue Siddipet : సమాజంలో స్త్రీకి రక్షణగా నిలిచి, వారిని గౌరవించే తత్వాన్ని ఇంటి నుంచే అలవాటు చేసే ఒక గొప్ప సంప్రదాయానికి ప్రతీక రాఖీ పండుగ. రక్షాబంధన్(Raksha Bandhan 2023) వస్తుందంటే చాలు అమ్మాయిలకు పండుగే. నెల రోజుల ముందు నుంచే ఎన్నో ప్రణాళికలు చేసుకుంటారు. రంగురంగుల బట్టలతో ముఖం మీద చిరునవ్వులు విరజిమ్ముతూ వాళ్లు చేసే సందడి అంతా ఇంతా కాదు.

Rakhi to Jawan Statue in Siddipet : బాల్యంలో తనతో బుడిబుడి నడకలు వేసి, ఆటలు ఆడిన ముద్దుల అన్నయ్యకు రాఖీ కట్టడమంటే ఎవరికి ఇష్టం ఉండదు. రాఖీ పౌర్ణమికి ముందుగానే మిత్రులతో కలిసి దుకాణానికి వెళ్లి ఎలాంటి రాఖీ కొనాలి.. ఏ స్వీట్స్ అయితే తన సహోదరునికి ఇష్టమో ఆలోచించి మరి కొనుగోలు చేస్తారు. ఇలా రాఖీ పౌర్ణమి రోజు అక్కా చెల్లెళ్లు సహోదరులకు రాఖీలు కట్టి, వారు క్షేమంగా ఉండాలని భగవంతున్ని ప్రార్ధిస్తారు. కానీ ఉన్న ఒక్కగానొక్క సహోదరుడు సైన్యంలో చేరి వీరమరణం పొందగా, సహోదరుడి సమాధి వద్ద తన ప్రతిరూపంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి ప్రతి ఏటా రాఖీలు కడుతూ తమ ప్రేమానురాగాన్ని చాటుతున్నారు ఆ అక్కాచెల్లెళ్లు.

Rakhi Purnima 2023 Special Story : రారండోయ్​.. రాఖీ పండుగ గురించి తెలుసుకుందాం..

Raksha Bandhan Celebrations Siddipet2023 : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రాజు తండాకు చెందిన గూగులోతు లింగయ్య, సత్తవలకు రాజమ్మ, బులమ్మ, శ్రీలత ముగ్గురు కుమార్తెలు కాగా.. నరసింహ నాయక్ ఒక్కగానొక్క కుమారుడు. నరసింహ నాయక్ సైన్యంలో చేరి సీఆర్పీఎఫ్ జవాన్(CRPF Jawan)​గా విధులు నిర్వహిస్తున్న సమయంలో 2014లో ఛత్తీస్​గఢ్​ లో నక్సల్స్ అమర్చిన మందు పాతర పేలి వీరమరణం చెందాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా నరసింహ నాయక్ సమాధి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి అక్కా చెల్లెల్లు రాఖీలు కడుతూ.. విగ్రహంలో తమ సహోదరున్ని చూసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Sisters Tie Rakhi TO Jawan Idol : రాఖీ పండుగ వచ్చిందంటే నరసింహ నాయక్ అక్కా చెల్లెళ్లకు ఏదో తెలియని వెలితి ఉంటుంది. చనిపోయినా తమ సోదరుడు తమ వద్దే ఉన్నాడని భావిస్తూ రాఖీ కడుతున్నామని ఆ సోదరీమణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు అందాల్సిన సహాయం అందిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు తమ కుటుంబానికి ఏ విధమైన సాయం చేయలేదని నరసింహ నాయక్.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సతీశ్​ కుమార్ వీర జవాన్ నరసింహ నాయక్ పేరు మీద తండాకు బీటీ రోడ్డు, గ్రంథాలయం, చదువుకున్న నరసింహ నాయక్ చెల్లెలు శ్రీలతకు ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారని ఏళ్లు గడుస్తున్నా.. ఆ హామీ నెరవేర్చలేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమకు సాయం చేయాలని కోరుతున్నారు.

Rakhi Celebrations Telangana 2023 : తెలంగాణలో 'రాఖీ' సంబురం.. అండగా ఉంటానని అన్నయ్య భరోసా.. పుట్టిళ్లు బాగుండాలని ఆడపడుచు కోరిక

Special Rakhis in Jagtial : వినూత్నంగా ఉండే రాఖీ కోసం చూస్తున్నారా..? అయితే ఇది ట్రై చేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.