ETV Bharat / state

ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దుబ్బాకలో ఎన్నికల వేడి

author img

By

Published : Sep 28, 2020, 8:09 AM IST

ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దుబ్బాకలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీలు సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నాయి. తెరాస, భాజపాకు తమ అభ్యర్థులపై కొంతమేర స్పష్టత ఉండటం వల్ల ఇప్పటికే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది.

Election heat in Dubbaka before the election notification
ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దుబ్బాకలో ఎన్నికల వేడి

ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దుబ్బాకలో ఎన్నికల వేడి

దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహ, ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. తెరాస నుంచి రామలింగారెడ్డి సతీమణి సుజాతకే టిక్కెట్ ఇవ్వనున్నట్లు పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. భాజపా నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రఘునందన్ రావు తనకే టికెట్ ఖాయమన్న ధీమాతో ప్రచారం మొదలు పెట్టారు. బలమైన ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది.

అసంతృప్తిని చల్లార్చి

గత ఎన్నికల్లో వచ్చిన ఆధిక్యం కంటే ఎక్కువ తెచ్చుకోవాలన్న లక్ష్యంతో తెరాస ఉంది. లక్ష ఓట్ల అధిక్యాన్ని నిర్దేశించుకున్న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు.. ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల్ని మండలానికోకరు చోప్పున ఇంఛార్జీగా.. సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను గ్రామాలకు ఇంఛార్జీలుగా నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కోన్ని చోట్ల తలెత్తిన అసంతృప్తిని చల్లార్చి.. క్యాడర్‌ను ఒక్కతాటి మీదికి తీసుకువచ్చే బాధ్యత వీరికి అప్పగించారు.

కార్యక్రమాల్లో వేగం

మంత్రి హరీశ్‌రావు ప్రతి రోజు దుబ్బాక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ప్రభుత్వ కార్యక్రమాల్లో వేగం పెంచారు. ప్రధానంగా భాజపాను లక్ష్యంగా చేసుకుని హరీశ్‌రావు తన ప్రచారాన్ని సాగిస్తున్నారు.

రఘనందన్ రావు సైతం

అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి, పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసిన రఘనందన్ రావు.. ఈసారి సైతం టికెట్ తనకే వస్తుంది అన్న ధీమాతో ప్రచారం మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను.. కేంద్రం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. గ్రామల్లో జెండా పండుగలు నిర్వహిస్తూ.. క్యాడర్‌ను ఎన్నికలకు సమాయాత్తం చేస్తున్నారు.

లక్ష ఓట్ల అధిక్యం సాధించి.. ప్రజలు తమవైపే ఉన్నారని... మరోసారి చాటాలని తెరాస వ్యూహాలు రచిస్తోంది. తాము విజయం సాధించి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని నిరూపించేందుకు ప్రతిపక్షాలు సమాయత్తమవుతున్నాయి.

ఇదీ చూడండి : రుణాలు ఇస్తామని రైతులను మోసం చేసిన ఫైనాన్స్‌ సంస్థ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.