ETV Bharat / state

గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న కేంద్రమంత్రి రుపాలా

author img

By

Published : Oct 24, 2019, 11:41 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మూడో రోజు జరిగిన 'గాంధీ సంకల్ప యాత్ర'లో  కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రుపాలా పాల్గొన్నారు.

గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న కేంద్రమంత్రి రుపాలా

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మూడో రోజు 'గాంధీ సంకల్ప యాత్ర'లో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రుపాలా, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందనరావు పాల్గొన్నారు. స్థానిక గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి పాదయాత్రగా వెళుతూ, పరిసరాల్లోని చెత్తను తొలగించారు. అనంతరం స్థానిక ఎస్​వీవీ డిగ్రీ కళాశాల విద్యార్థులతో స్వచ్ఛ భారత్, పరిసరాల పరిశుభ్రత గురించి ముచ్చటించారు. దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని మొక్కలను నాటారు. చేనేత సహకార సంఘం వద్దకు చేరుకొని వారు తయారుచేసిన బట్టలను పరిశీలించారు. వారు బహుకరించిన చేనేత రుమాలును చూసి మంత్రి ప్రశంసించారు. ఆర్టీసీ కార్మికులు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో పాల్గొని వారు ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించారు. చేనేత కార్మికుల సమస్యలను తప్పకుండా కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న కేంద్రమంత్రి రుపాలా

ఇవీ చూడండి: అన్నం తింటున్న ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు

Intro:గాంధీజీ సంకల్ప పాదయాత్ర మూడవ రోజు లో భాగంగా దుబ్బాక లో జరిగిన పాదయాత్రలో పాల్గొన్న కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల.


Body:సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గాంధీజీ సంకల్ప పాదయాత్ర మూడవరోజు లో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం .రఘునందనరావు నాయకత్వంలో జరుగుతున్న పాదయాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్థానిక గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి పాదయాత్రగా వెళుతూ, పరిసరాలలోని చెత్తను తొలగించారు.
అనంతరం స్థానిక ఎస్ వి వి డిగ్రీ కళాశాల విద్యార్థులతో గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛభారత్ మరియు పరిసరాల పరిశుభ్రత గురించి ముచ్చటించారు. అక్కడి నుండి దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని మొక్కలను నాటి, అక్కడి నుండి చేనేత సహకార సంఘం వద్దకు చేరుకొని వారు తయారుచేసిన బట్టలను పరిశీలించారు. అనంతరం వారు బహూకరించిన చేనేత రుమాలును చూసి మంత్రముగ్ధుడు అయ్యాడు.

ఆర్టీసీ కార్మికులు ఏర్పాటుచేసిన కృతజ్ఞత సభలో పాల్గొని వారు ఇచ్చిన వినతిపత్రాన్ని స్వీకరించారు.చేనేత కార్మికుల సమస్యలను తప్పకుండా కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
ఇక్కడి ప్రజలు చూపిన ఆదరాభిమానాలు మరువలేనిదని అన్నారు. తాను కూడా గాంధీజీ పుట్టిన రాష్ట్రం నుండి వచ్చాను అని అన్నారు.



Conclusion:గాంధీజీ సంకల్ప పాదయాత్ర మూడవ రోజు లో భాగంగా దుబ్బాక లో జరిగిన పాదయాత్రలో రఘునందన్ రావు తో పాటు, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల పాల్గొన్నారు.

పాదయాత్రలో బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ, బీజేపీ కిసాన్మోర్చా ఉపాధ్యక్షుడు తోట కమలాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కిట్ నంబర్:1272, బిక్షపతి, దుబ్బాక.
9347734523.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.