ETV Bharat / state

YUVA: శెభాష్​ కిర్పాన్ కౌర్ - ఎగ్జామ్స్​కు 2 రోజుల ముందు అపస్మారక స్థితి నుంచి బయటకు - అయినా టెన్త్​లో 8.7 జీపీఏ - Hyd Girl get Good Markers in 10th

author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 7:27 PM IST

Updated : May 25, 2024, 3:49 PM IST

Kirpan Kaur Met With Accident Scored Well in 10th : టెన్త్‌లో మంచి మార్కులు సాధించి ఎంబీబీఎస్ చేయాలనేది ఆ అమ్మాయి కల. అందుకోసం రేయింబవళ్లు ఎంతగానో కష్టపడింది. కానీ అనుకోని ఆపద ఆ చిన్నారి ఆశలకు బ్రేక్ వేసింది. పది పరీక్షలకు సరిగ్గా 2 వారాల ముందు ఐసీయూలో చేరేలా చేసింది. అయినా వెనకడుగు వేయలేదు. గాయాల నొప్పిని పంటి బిగువున దిగమింగి, పదో తరగతి పరీక్షలకు హాజరయ్యింది. పరీక్షలు రాయలేని పరిస్థితిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో పది ఫలితాల్లో సత్తా చాటింది. మరి ఆ అమ్మాయి ఎవరో? ఆమె స్ఫూర్తి గాథ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Hyderabad Girl Met With Accident Scored Well in 10th
Kirpan Kaur Met With Accident Scored Well in 10th (ETV Bharat)

Hyderabad Girl Met With Accident Scored Well in 10th : రెప్ప పాటులో జరిగిన ప్రమాదం మానసికంగా కుంగదీసినా, తీవ్రగాయాలు శరీరాన్ని వేధిస్తున్నా, లక్ష్యం మరువలేదు ఈ అమ్మాయి. భరించలేనంత నొప్పితో బాధపడుతూనే ఆత్మ స్థైర్యం కూడగట్టుకుని పది పరీక్షలు రాసింది. వయసుకు మించిన పరిణతిని ప్రదర్శించి లక్ష్యం కోసం పోరాడి అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది.

హైదరాబాద్‌లోని నాంపల్లికి చెందిన ఈ అమ్మాయి పేరు కిర్పాన్ కౌర్. తరణ్ జిత్ సింగ్, అస్మిత్‌ కౌర్ దంపతుల మొదటి కుమార్తె. ఖనూజా అబిడ్స్ స్లేట్ స్కూల్‌లో 10వ తరగతి పూర్తి చేసింది. ఈ ఏడాది మార్చి ఒకటిన ప్రీ ఫైనల్ పరీక్ష రాసి తల్లి అస్మిత్ కౌర్​తో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికెళ్తుండగా ఓ యువకుడు వేగంగా వచ్చి బైక్‌ను వెనక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం బారిన పడింది. తల్లి అస్మిత్‌ కౌర్‌కు స్వల్ప గాయాలైనా, కిర్పాన్‌ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

On A Ventilator Two Weeks Before Exams : హఠాత్తుగా జరిగిన ప్రమాదంతో వారం రోజులు హాస్పిటల్‌లోనే ఉండిపోయింది కిర్పాన్‌ కౌర్‌. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక మెల్లగా జరిగింది అర్థం చేసుకోవటం మొదలుపెట్టింది. పది పరీక్షలకు సరిగ్గా 2 రోజులే ఉందని తెలిసి నిరాశ కలిగినా, తన కష్టం ఎట్టి పరిస్థితిల్లోనూ వృథా కాకూడదని నిశ్చయించుకుంది. పట్టుబట్టి తల్లిదండ్రుల్ని ఒప్పించి పరీక్షలకు హాజరయ్యింది.

"నేను ఇంటికి వచ్చాక కూడా స్పృహలో లేను. లేచి చూసేసరికి నాకు ఏమైందో కూడా సరిగ్గా తెలీదు. నా మొఖం మీద అన్ని మరకలు ఉన్నాయి. ఒకసారి అయితే పరీక్షలు రాయలేను అనుకున్నాను. కానీ ఎలాగైనా రాయలి అనుకున్నాను. ఈ విషయం ఇంట్లో చెప్తే మొదట్లో కంగారుపడ్డారు. కానీ తర్వాత వారు మా టీచర్స్‌ సంప్రదించడంతో వారి సహాయంతో పరీక్షలు రాయగలిగాను. ఇంత మంచి మార్కులు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను." - కిర్పాన్ కౌర్‌, విద్యార్థి

మూడు చక్రాల సైకిల్‌తోనే బతుకు పోరాటం​ - పదిహేనేళ్లుగా సర్కార్​ సాయమందని దివ్యాంగుడు - Warangal Handicapped Man Story

Kirpan Kaur Khanuja Passed Out SSC : ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకోకముందే పరీక్షలు దగ్గర పడటంతో ఒకదశలో రాయలేనని భావించింది కిర్పాన్‌ కౌర్‌. కానీ, ఓటమిని అంగీకరించవద్దని తల్లిదండ్రులు, స్కూలు టీచర్ల సహకారంతో స్క్రైబ్‌ని ఏర్పాటు చేసుకుని పరీక్షలు రాసింది. పది ఫలితాల్లో 8.7 జీపీఏ సాధించి ఆశ్చర్యపరచింది. కిర్పాన్‌ పట్టుదలను అభినందిస్తూ ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం ఇంటర్​లో ఉచిత సీటుని ఆఫర్ చేసింది. పరీక్షలు రాయలేని స్థితిలో ఉండీ, పది ఫలితాల్లో 8.7 జీపీఏ సాధించడం ఆనందంగా ఉందని అంటోంది కిర్పాన్ కౌర్‌. ఎప్పటికైనా వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయటమే తన ఆశయమని చెబుతోంది.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత మందుల ప్రభావం వల్ల కుమార్తె మెలకువలో ఉండేది కాదంటోంది కిర్పాన్ తల్లి. అంతటి నొప్పిని తట్టుకుని పట్టుదలతో పరీక్ష రాసి 8.7 జీపీఏ సాధించటం గర్వంగా అనిపిస్తోందని చెబుతోంది. భవిష్యత్తులో వైద్యురాలిగా సమాజానికి సేవ చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది కిర్పాన్ కౌర్. చాలామంది చిన్న చిన్న ఇబ్బందులకే ఆందోళన చెంది లక్ష్యానికి దూరం అవుతుంటారని, పట్టుదలతో కష్టపడితే తప్పక ప్రతిఫలం దక్కుతుందని సూచిస్తోంది.

పరీక్షల సమయంలో ప్రమాదానికి గురైన అమ్మాయి ఉత్తీర్ణత సాధించి ఆదర్శంగా నిలుస్తున్న కిర్పాన్ కౌర్ (ETV Bharat)

YUVA : కష్టాలకు ఎదురీత జివాంజీ దీప్తి - పారా అథ్లెటిక్స్​లో సత్తా చాటిన వరంగల్​ బిడ్డ - Special Story On Deepthi Jeevanji

గాజుబొమ్మను ఉక్కులా మార్చి ఛాంపియన్​ను చేసిన తల్లి - జీవనపోరాటంలో చివరికి గెలుపు 'అమ్మ'దే - Mothers Day Special story 2024

Last Updated : May 25, 2024, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.