ETV Bharat / state

జిల్లా ఆస్పత్రికి అదనపు బ్లడ్​ బ్యాంకు కేటాయించాలి: జగ్గారెడ్డి

author img

By

Published : Mar 23, 2021, 9:06 PM IST

సంగారెడ్డి పరిధిలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున జిల్లా ఆస్పత్రిలో అదనపు బ్లడ్​ బ్యాంక్​ ఏర్పాటు చేయాలని కలెక్టర్​ను ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. నియోజకవర్గంలోని సమస్యలపై జిల్లా పాలనాధికారి హనుమంతరావుతో ఆయన చర్చించారు.

sangareddy MLA Jagga Reddy meet collector hanumantha rao to solve problems in his  constituency
జిల్లా ఆస్పత్రికి అదనపు బ్లడ్​ బ్యాంకు కేటాయించాలి: జగ్గారెడ్డి

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఐదు వేల ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు ఇవ్వలేదని కాంగ్రెస్​ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. కలెక్టరు హనుమంతరావు దృష్టికి తీసుకొచ్చారు. నియోజకవర్గ పరిధిలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున జిల్లా ఆస్పత్రిలో అదనంగా రెడ్​క్రాస్ ద్వారా బ్లడ్ బ్యాంక్​ ఏర్పాటు చేయాలని కోరారు. నాలుగు మండలాల ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జిల్లా పాలనాధికారికి విజ్ఞప్తి చేశారు.

అకోలా-నాందేడ్ రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న గుడితండా గ్రామస్థులకు నష్ట పరిహారం పెంచాలన్నారు. సదాశివపేటలో ప్రభుత్వ ఆస్పత్రి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందని కలెక్టర్​ దృష్టికి తెచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పట్టణంలోని ఆస్పత్రిలో వైద్యం అందించాలని కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ సంగారెడ్డి అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు వేదికలు: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.