ETV Bharat / state

Fire Accident in Sangareddy : సంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. పేలిన రియాక్టర్లు

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 14, 2023, 10:26 AM IST

Updated : Oct 14, 2023, 12:32 PM IST

Fire Accident in Hyderabad
Fire Accident in Sangareddy

Fire Accident in Sangareddy : సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని అమర్‌ల్యాబ్‌ రసాయన పరిశ్రమలో రెండు రియాక్టర్‌లు పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు గాయపడటంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Fire Accident in Sangareddy : సంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. పేలిన రియాక్టర్లు

Fire Accident In Sangareddy : సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని అమర్‌ల్యాబ్‌ రసాయన పరిశ్రమలో రెండు రియాక్టర్‌లు పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. మంటల్లో చిక్కుకున్న కార్మికుల కోసం రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా వారిని బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Fire Accident at RTC Bus in Korutla : డిపోలో ఆపిన బస్సులో మంటలు.. శుభ్రం చేస్తుండగా ప్రమాదం

బొల్లారం పారిశ్రామికవాడలోని అమర్‌ల్యాబ్‌ రసాయన పరిశ్రమలో రెండు రియాక్టర్‌లు పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద సమయంలో కంపెనీలో చాలా మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో భారీ శబ్దం వచ్చింది. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో చిక్కుకున్న కార్మికుల కోసం రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

ఈ సమయంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడటంతో వారిని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. దీనిలో 11 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వీరిని బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత చుట్టుపక్కల కిలో మీటరు వరకూ పొగలు అలముకున్నాయి. పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ అమర్‌ ల్యాబ్‌ పరిశ్రమలో గతంలో కూడా ఇటువంటి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

Fire Accident in Hyderabad : మరో ఘటనలో హైదరాబాద్​ మెహదీపట్నంలో ఓ అపార్ట్​మెంట్​లో అగ్నిప్రమాదం సంభవించింది. అపార్ట్​మెంట్​లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో నివాస గృహం పూర్తిగా దగ్ధమయింది.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. భవనం నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం వల్ల.. కాలనీలోని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. అపార్ట్​మెంట్​లో ఫైర్ సెఫ్టీ పరికరాలు ఏ మేరకు ఉన్నాయో లేవా అని అగ్నిమాపక శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. ఇవాళ మరోసారి భవనాన్ని పూర్తిగా తనిఖ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

Fire Accident In Crackers Shop : బాణాసంచా దుకాణంలో పేలుడు.. 9 మంది మృతి

Firecracker Accident : సెలవులని పనికి వచ్చిన 8 మంది విద్యార్థులు మృతి.. బాణసంచా ప్రమాదంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం

Last Updated :Oct 14, 2023, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.