ETV Bharat / bharat

Fire Accident In Crackers Shop : బాణాసంచా దుకాణంలో పేలుడు.. 9 మంది మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 1:46 PM IST

Updated : Oct 9, 2023, 6:59 PM IST

Fire Accident In Crackers Shop : బాణాసంచా దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులో జరిగిందీ ఘటన.

Fire Accident In Crackers Shop
Fire Accident In Crackers Shop

Fire Accident In Crackers Shop : కర్ణాటకలోని బాణాసంచా గోదాంలో జరిగిన ఘోర విషాదం మరువక ముందే మరో ఘటన తమిళనాడులో జరిగింది. బాణాసంచా దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అరియాలూర్​ జిల్లాలో జరిగిందీ దుర్ఘటన.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని వీరకలూరు గ్రామంలో రాజేంద్రన్​.. జాఫ్నా క్రాకర్స్​ పేరుతో టపాసులు విక్రయించే దుకాణాన్ని నడుపుతున్నాడు. దీపావళి పండుగ దగ్గర పడుతుండడం వల్ల శివకాశీకి చెందిన 35 మంది.. టపాసుల తయారీలో నిమగ్నమయ్యారు. సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలు వ్యాపించి పెద్ద పెద్ద శబ్దాలతో టపాసులు పేలాయి. మంటలు, పొగ వ్యాపించడం వల్ల స్థానికులు.. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.

Fire Accident In Crackers Shop
ఘటనాస్థలిలో ఎగిసిపడుతున్న మంటలు

Tamil Nadu Crackers Shop Fire Accident : సమాచారం అందుకున్న వెంటనే.. మూడు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. దాదాపు మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. తీవ్రగాయాలతో గాయపడిన వారు.. తంజావూరు బోధనాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న జిల్లా ఎస్​పీ అబ్దుల్లా ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదస్థలికి ప్రజలు ఎవరూ రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

తొమ్మిది బైక్​లు దగ్ధం..
ఈ ఘటనపై కీళపాలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రమాద సమయంలో ఒక వ్యాన్, ఒక ట్రాక్టర్​, తొమ్మిది ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయని తెలిపారు. రెండు టపాసుల తయారీ గోదాములు నేలమట్టమైనట్లు చెప్పారు.

చిన్నారి సహా ఏడుగురు స్పాట్ డెడ్
కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఏడుగురు మరణించారు. టిప్పర్​​-క్రూజర్​ ఢీకొనడం వల్ల ఏడుగురు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటన విజయనగర జిల్లాలోని హోసపెటే తాలుకాలోని జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో మరో లారీ సైతం అదుపుతప్పి బోల్తా పడింది. మృతులను హోసపెటేకు చెందిన వారిగా గుర్తించారు. హర్పనపల్లి తాలుకాలోని కూలహళ్లి గోనిబసవేశ్వర ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇంకా కొద్ది సమయం అయితే, వీరంతా.. తమ ఇళ్లకు చేరుకునేవారని పోలీసులు చెప్పారు.

Cracker Factory Blast : బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు దుర్మరణం

Firecracker Accident : బాణాసంచా గోదాంలో ప్రమాదం.. 14కు చేరిన మృతుల సంఖ్య.. రూ.8 లక్షల పరిహారం!

Last Updated : Oct 9, 2023, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.