ETV Bharat / bharat

Firecracker Accident : బాణాసంచా గోదాంలో ప్రమాదం.. 14కు చేరిన మృతుల సంఖ్య.. రూ.8 లక్షల పరిహారం!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2023, 10:51 AM IST

Firecracker Accident In Karnataka
Firecracker Accident In Karnataka

Firecracker Accident In Karnataka : కర్ణాటకలోని బాణాసంచా గోదాంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలోని మృతుల సంఖ్య 14కు చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు రూ. 3లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.

Firecracker Accident In Karnataka : కర్ణాటక-తమిళనాడులో సరిహద్దులో అత్తిబెలె గ్రామంలోని బాణసంచా గోదాంలో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఆదివారం చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. ఈ దుర్ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.3లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పును ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఈ ప్రమాదంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శక్కరపాణి, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సుబ్రమణ్యం​ను స్టాలిన్ ఆదేశించారు.

Firecracker Accident In Karnataka
ప్రమాదం స్థలంలో ఎగసిపడుతున్న మంటలు

అంతకుముందు శనివారం రాత్రి ఘటనాస్థలాన్ని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. ఈ 'అగ్నిప్రమాదం వార్త విని నేను చాలా బాధపడ్డాను.. ఆదివారం ఘటనాస్థలిని పరిశీలిస్తానుట అని సోషల్​మీడియా వేదిక ఎక్స్​లో ట్వీట్​ చేశారు.

ఈ ఘటనపై కర్ణాటక డీజీపీ అలోక్​ మోహన్​ మీడియాతో మాట్లాడారు. "అగ్ని ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. గోదాంలో 35 మంది పనిచేస్తున్నారు. షాప్ యజమానితోపాటు అతడి కుమారుడిని అరెస్టు చేశాం. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నాం. దర్యాప్తులో అగ్నిప్రమాదానికి అసలు కారణం తెలుస్తుంది" అని చెప్పారు.

  • #WATCH | Karnataka DGP Alok Mohan says "This is a cracker shop. The fire started yesterday in the afternoon and 14 people lost their lives in the fire incident. We will take up the investigation in the right way. A total of 5 people are accused in the case and 2 people have been… https://t.co/vlUfMxnOVo pic.twitter.com/rlgLivGGe5

    — ANI (@ANI) October 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ జరిగింది..
శనివారం సాయంత్రం 7 గంటలకు అత్తిబెలె గ్రామంలో ఉన్న బాలాజీ క్రాకర్స్​లో చిన్న మంటలు చెలరేగాయి. అనంతరం మంటలు వేగంగా వ్యాపించడం వల్ల గోదాం మొత్తం దహనమైంది. ప్రమాద సమయంలో గోదాంలో 20 మందికి పైగా కార్మికులు ఉన్నారు. వీరిలో నలుగురు తప్పించుకున్నారు. బాణసంచా లోడ్​ను లారీ నుంచి గోదాంలోకి దించుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే గోదాం సమీపంలో ఉన్న అనేక వాహనాలు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

ఈ దుర్ఘటనలో శనివారం 12 మంది చనిపోయారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు ఆదివారం మృతిచెందారు. అయితే మృతులంతా తమిళనాడుకు చెందిన వారని పోలీసులు చెబుతున్నారు. ఇందులో 8 మంది ధర్మపురి జిల్లా హరూర్​ మండలం అమ్మపెట్టై గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మరో ముగ్గురు కల్లకురుచ్చి జిల్లాకు చెందిన వారుగా, ఇక మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించలేదని చెప్పారు.

బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ముగ్గురు మృతి

Cracker Factory Blast : బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.