ETV Bharat / politics

పంజాగుట్ట పోలీస్​స్టేషన్​లో కేఏ పాల్​పై చీటింగ్​ కేసు నమోదు - Case Filed Against Ka Paul

author img

By ETV Bharat Telangana Team

Published : May 17, 2024, 8:59 PM IST

Case Filed Against Ka Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి తన వద్ద రూ.50 లక్షలను కేఏ పాల్ ​ తీసుకున్నారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేఏ పాల్​పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.

Case Filed Against Ka Paul
Case Filed Against Ka Paul (ETV Bharat)

Case Filed Against Ka Paul In panjagutta Police station : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్​లో కేసు నమోదయింది. తన పార్టీ తరపున ఎల్బీనగర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి తన వద్ద నుంచి రూ.50 లక్షలు తీసుకున్నారని రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు పాల్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. టిక్కెట్టు ఇస్తానని చెప్పడంతో తాను రూ.30 లక్షలు ఆన్లైన్లో చెల్లించి మిగిలిన రూ.20 లక్షలను దఫా దఫాలుగా చెల్లించినట్లు కిరణ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అసలు ఇంతకీ ఎవరీ కేఏ పాల్​ : తన సంచలన వ్యాఖ్యల ద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విశాఖపట్నానికి దగ్గర్లోని చిట్టివలసలో ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన కేఏ పాల్​ ఒకానొక దశలో క్రైస్తవమత ప్రబోధకుడిగా మంచి పేరు సంపాదించారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు.

అభివృద్ధిపై బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ అబద్దపు మాటలు చెబుతున్నాయి: కేఏ పాల్‌ - KA Paul on BRS and Congress

Contest as MP Candidate in Visakhapatnam : ఈసారి కూడా ఆయన ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గానికి పోటీచేశారు. ఎన్నికల్లో మిగతా పార్టీల కంటే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​ ఎక్కువ హంగామా చేశారు. తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ఆడుతూ, పాటుతూ ఎన్నికల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చారు. ఆయన గతంలో జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో కూడా కేఏ పాల్​ పోటీ చేశారు. ఆయన చివరకు 805 ఓట్లు మాత్రమే సాధించారు.

ఈసారి ఎన్నికల్లో కుండ గుర్తుతో ఎన్నికల్లో కేఏ పాల్​ పోటీచేశారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సారి ఎన్నికల్లో తాను భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను గెలిస్తే విద్య, ఉద్యోగాలు, ఉచిత వైద్యం కల్పిస్తానని ఎన్నికలో హామీ ఇచ్చారు.

ప్రజా శాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబూమోహన్​ - ప్రకటించిన కేఏ పాల్​ - KA Paul Comments on Congress

రాష్ట్రంలో యాక్టివ్​గా ఉన్నా మా పార్టీకి గుర్తు ఎందుకు ఇవ్వలేదు : కేఏ పాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.