ETV Bharat / state

చెత్త సమస్యకు పరిష్కారమెప్పుడు - డంపింగ్​యార్డ్ లేక ఇబ్బందిపడుతున్న ప్రజలు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 5, 2023, 10:59 AM IST

Dumping Yard Issue In Sangareddy : సంగారెడ్డి జిల్లాలో డంపింగ్ ​యార్డ్ లేక వార్డుల్లో చెత్తను సేకరించి రోడ్లు, మురుగు కాల్వల్లో వేస్తున్నారు. దీంతో డ్రైనేజీల నుంచి దుర్వాసన రావడం సహా అనారోగ్యాల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. వచ్చే ప్రభుత్వం సంగారెడ్డిలో డంప్ ​యార్డును ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.

Dumping Yard Problem In Sangareddy
Dumping Yard Issue In Sangareddy

చెత్త సమస్యకు పరిష్కారమెప్పుడు - డంపింగ్​యార్డ్ లేక ఇబ్బందిపడుతున్న ప్రజలు

Dumping Yard Issue In Sangareddy : ఉమ్మడి మెదక్‌ జిల్లాకు సంగారెడ్డి కేంద్ర బిందువు. కానీ నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలు మారుతున్నాయి. పాలకులతో పాటు అధికారులు మారుతున్నారు. కానీ పట్టణం అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు. అభివృద్ధిలో భాగమైన జిల్లాలో చెత్త సేకరణ, డంపింగ్‌ ప్రధాన సమస్యగా మారింది.

సంగారెడ్డి పట్టణం హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉంటుంది. అంతేకాదు జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ వంటి పట్టణాల సరిహద్దును కలిగి ఉంది. కానీ జనాభా పెరుగుదలకు అనుగుణంగా పట్టణం మాత్రం అభివృద్ధి చెందలేకపోతుంది. పట్టణంలో డంపింగ్​యార్డ్‌ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినా భూసేకరణలో అధికారులు మూగనోము నోచారు. వార్డుల్లో చెత్తను సేకరించి రోడ్లు, మురుగు కాల్వల్లో వేస్తున్నారు. దీంతో డ్రైనేజీల నుంచి దుర్వాసన రావడం సహా అనారోగ్యాల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.

''డంప్​ యార్డ్ ఏర్పాటు చేయడంలో ఇక్కడి నాయకులు పూర్తిగా విఫలమయ్యారు. 25 సంవత్సరాల నుంచి డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. వార్డుల్లో చెత్తను సేకరించి రోడ్లు, మురుగు కాల్వల్లో వేస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్థలాన్ని సేకరించి డంప్​ యార్డ్ ఏర్పాటు చేయాలి.'' - స్థానికులు

రాత్రిపూట డంపింగ్ యార్డ్ పొగ.. ఆరోగ్యానికి సెగ

Dumping Yard Problem In Sangareddy : సంగారెడ్డి మండల పరిధిలోని పసల్వాది గ్రామ శివారులో రెండు కోట్ల రూపాయలతో రెండేళ్ల క్రితం తాత్కాలిక డంపింగ్​యార్డ్ ఏర్పాటు చేశారు. కానీ పూర్తి స్థానిలో సిబ్బంది లేక నిరుపయోగంగా మిగిలింది. కేవలం 18 వార్డుల చెత్త మాత్రమే అక్కడ వేయడానికి అనుకూలంగా ఉంది. అంతేగాక చెత్తను డంప్ చేయడంవల్ల చెరువులోని నీరు కలుషుతమైతోందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

డంప్​యార్డ్ లేకపోవడంతో పట్టణ శివారు ప్రాంతాల్లో చెత్త ఎక్కువగా పేరుకుపోతోంది. చెత్తకు మున్సిపల్‌ సిబ్బంది నిప్పు పెట్టడంతో దట్టమైన పొగ వ్యాపించి వాహనదారులకు ఇబ్బందిగా మారుతోంది. పట్టణ శివారులో ఉన్న శిల్పారామం పార్కులో చెత్త వేయడంతో ఆహ్లాదాన్ని పంచే పార్కు చెత్త కుండిలా మారుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

చెత్త పన్ను కట్టలేదని మున్సిపల్ సిబ్బంది ఏం చేశారంటే

"రోడ్డుపై ఉన్న మురుగు కాలువల్లో చెత్త వేయడం వల్ల రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. దీని పక్కనే ఫంక్షన్​ హాల్ ఉంది. చెత్త దుర్వాసన ద్వారా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంగారెడ్డి మండల పరిధిలోని పసల్వాది గ్రామ శివారులో రెండేళ్ల క్రితం తాత్కాలిక డంపింగ్‌ యార్డ్ ఏర్పాటు చేశారు. కానీ పూర్తి స్థాయిలో సిబ్బంది లేక నిరుపయోగంగా మిగిలింది. కేవలం18 వార్డుల చెత్త మాత్రమే అక్కడ వేయడానికి అనుకూలంగా ఉంది. మిగతా వార్డుల చెత్త రోడ్లపైన, మురుకి కాల్వల్లో వేయడంతో దుర్వాసన వస్తుంది. వచ్చే ప్రభుత్వం సంగారెడ్డిలో డంప్​ యార్డును ఏర్పాటు చేయాలని కోరుతున్నాం '' -స్థానికులు

కొత్తగా కొలువుదీరనున్న కేబినెట్ - మంత్రులుగా ఛాన్స్​ వీరికేనా?

'చెత్త వాహనం'పై స్టంట్స్.. ప్రమాదకరంగా పుష్అప్స్.. సడన్​గా కిందపడి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.