ETV Bharat / state

Political Heat in Rangareddy District : రసవత్త'రంగా'రెడ్డి రాజకీయం.. ఓటర్లను ఆకర్షించేందుకు నేతల పాట్లు

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2023, 9:34 AM IST

Political Heat in Rangareddy District : రంగారెడ్డి జిల్లాలో బీఆర్​ఎస్​ అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను మచ్చిక చేసుకుంటున్నారు. షాద్‌నగర్, చేవెళ్ల మినహా పూర్తిస్థాయిలో కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ అభ్యర్థులుగా ఎవరు బరిలో ఉంటారన్న ఉత్కంఠ నెలకొంది. క్షేత్రస్థాయి నాయకులు పార్టీలు మారుతూ ఎన్నికలను రసవత్తరంగా మారుస్తున్నారు.

Political Leaders Election Campaign in Rangareddy
Telangana Assembly Elections

Political Heat in Rangareddy రంగారెడ్డి జిల్లాలో రంజుకుంటున్న రాజకీయం

Political Heat in Rangareddy District : రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లా ఒకటి. ప్రధాన పార్టీల్లోని నాయకులు అధిష్ఠానానికి అత్యంత దగ్గరగా ఉండటం కలిసొచ్చే అంశం. అందుకే టికెట్ ఆశించే వారితో పాటు పోటీపడే వారు ఆ జిల్లాలో ఎక్కువగానే ఉంటారు. ఈ దఫా ఎన్నికల్లో పోటీ పడేందుకు బీఆర్​ఎస్​ పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి బీ-ఫామ్‌లు అందించింది. షాద్‌నగర్, చేవెళ్ల మినహా మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. బీజేపీ అభ్యర్థులు ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది.

Telangana Election Campaign 2023 : చేవెళ్ల నుంచి బీఆర్​ఎస్​ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కాలె యాదయ్య మరోసారి టికెట్ దక్కించుకొని ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కాలె యాదయ్య ఏడాది తిరగకుండానే గులాబీ పార్టీలో చేరారు. 2018లో బీఆర్​ఎస్​ తరపున పోటీ చేసి గెలిచారు. ఈసారి యాదయ్యకి పోటీగా రత్నం నిలవాలని ప్రయత్నించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన రత్నం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్​ఎస్​లో చేరారు. ఈసారి టికెట్ తనకే వస్తుందని ఆశించినా అధిష్ఠానం సిట్టింగ్‌లకే మళ్లీ అవకాశం ఇవ్వడంతో అసంతృప్తికి గురయ్యారు.

Political Heat in Khammam District : రసవత్తరంగా ఖమ్మం రాజకీయం.. నువ్వానేనా అంటూ బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ ఢీ

MLA Candidates in Rangareddy District : కాంగ్రెస్ నుంచి సున్నం వసంతం, మొయినాబాద్‌కి చెందిన దర్శన్, శంషాబాద్ నుంచి సిద్ధేశ్వర్ టికెట్ ఆశించగా అనూహ్యంగా షాబాద్‌కి చెందిన భీమ్ భరత్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. బీజేపీ నుంచి కంజెర్ల ప్రకాశ్, వరి తులసిరాం టికెట్ ఆశిస్తుండగా.. తులసిరాంకు టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సముచిత స్థానం కల్పించకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని రత్నం చెబుతున్నారు. రాజేంద్రగర్ నుంచి మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌ను బీఆర్​ఎస్​ ఖరారు చేసింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించాక పూర్తిస్థాయిలో ప్రచారానికి శ్రీకారం చుట్టాలని ప్రకాశ్‌గౌడ్‌ భావిస్తున్నారు.

"రాజకీయాల్లో అధికారం వస్తుంది.. పోతుంది. నాయకుల వెనకాల ఉన్న కార్యకర్తల భద్రత ముఖ్యం. నాకు పదవి ఉన్నా లేకపోయినా చేవెళ్ల గడ్డకు జీవితాంతం సేవ చేస్తాను. కార్యకర్తల అభీష్టం మేరకు తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తాను." - రత్నం, బీఆర్​ఎస్​ నాయకుడు

Rangareddy MLA Candidates List 2023 : ఇబ్రహీంపట్నంలో మూడుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి వైపే.. కేసీఆర్‌ మరోసారి మొగ్గుచూపారు. మరోసారి టికెట్ ఇవ్వడంతో నాలుగోసారి గెలుపునకు మంచిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, మర్రి నిరంజన్ రెడ్డి, దండెం రాంరెడ్డి పేర్లు తెరపైకి రాగా ప్రధానంగా మల్‌రెడ్డి రంగారెడ్డి(Mal Reddy RangaReddy) పేరు వినిపిస్తోంది. గతంలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన ఆయన.. ఈసారి మంచిరెడ్డికి గట్టిపోటీ ఇస్తాడని హస్తం పార్టీ భావిస్తోంది. బీజేపీ అభ్యర్థులెవరో ఖరారు కాలేదు. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ ఇబ్రహీంపట్నం నుంచి పోటీచేసే అవకాశం కనిపిస్తుంది. వామపక్షాలు, టీడీపీ ఇబ్రహీంపట్నంలో తటస్థంగా ఉన్నాయి.

Election Campaign in Telangana : ఎన్నికల వేళ జోరందుకున్న ప్రచారాలు.. పోటాపోటీగా ప్రజలకు ఆఫర్లు

ఎల్బీనగర్‌లోని గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి గులాబీ గూటికి చేరిన సుధీర్‌రెడ్డికి అధిష్ఠానం మరోసారి టికెట్ ఇవ్వడంతో.. అనుచరులు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువిరిసింది. డివిజన్ స్థాయిలో కార్యకర్తలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్న సుధీర్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రచారాన్ని మొదలుపెట్టలేదు. కాంగ్రెస్ నుంచి ప్రచార కమిటి ఛైర్మన్ మధుయాస్కీ పోటీ చేయాలని ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి సామ రంగారెడ్డి బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. మహేశ్వరం నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) మరోసారి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు.

Telangana Assembly Elections 2023 : బీ-ఫారమ్‌ అందుకున్న సబిత.. డివిజన్ల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి బడంగ్ పేట మేయర్ పారిజాత నర్సింహారెడ్డి టికెట్ ఆశిస్తుండగా ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అలాగే బీజేపీ నుంచి అందెల శ్రీరాములకు టికెట్ దక్కనుంది. బడంగ్‌పేటలో నిర్వహించిన బహిరంగసభలో రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి శ్రేణుల్లో ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీకి బీఆర్​ఎస్​ మరోసారి టికెట్ దక్కింది. కానీ కార్పొరేటర్ల గండం మాత్రం తప్పడం లేదు. ప్రచారం మొదలుపెట్టిన రోజే బీఆర్​ఎస్​కు చెందిన ఇద్దరు కీలక కార్పొరేటర్లు హస్తం పార్టీలో చేరారు.

Chevella Ex MLA Ratnam Independent Competition : 'కార్యకర్తలు, అభిమానుల కోసం ఇండిపెండెంట్‌గా నిలబడతా'

మాదాపూర్‌కు చెందిన జగదీశ్వర్‌గౌడ్.. హఫీజ్ పేట కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరడంతో అరికెపూడి గాంధీ ప్రచారాన్ని నిలిపివేసి క్షేత్రస్థాయిలో సమాలోచనలు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. జగదీశ్వర్ గౌడ్‌తో పాటు రఘునాథ్‌యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. పీసీసీ ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన యోగానంద్ మరోసారి టికెట్ కావాలని పట్టుపడుతుండగా రవికుమార్ యాదవ్ పేరు వినిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి వీర్లపల్లి శంకర్‌కి టికెట్ ఖరారైంది. గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీచేసి ఓడిపోయిన శంకర్​ను దగ్గరకు తీసుకున్న కాంగ్రెస్.. మూడు నాలుగు నెలలుగా గ్రామస్థాయిలో శంకర్ పనితీరు చూసి టికెట్ ఖరారు చేసింది. అలాగే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి.. బీఆర్​ఎస్​ను వీడి హస్తం పార్టీలో చేరుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు గెలుపుపై ధీమాతో ఉన్నాయి.

BRS MLA Rathod Bapurao to Join Congress : కాంగ్రెస్​లో చేరికల జోష్.. హస్తం​ గూటికి బీఆర్ఎస్​ ఎమ్మెల్యే!

KCR Medchal Jadcherla Tour Today : ప్రచారంలో కారు జోరు.. నేడు జడ్చర్ల, మేడ్చల్​లో కేసీఆర్​ సభలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.