ETV Bharat / state

KCR Medchal Jadcherla Tour Today : ప్రచారంలో కారు జోరు.. నేడు జడ్చర్ల, మేడ్చల్​లో కేసీఆర్​ సభలు

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2023, 7:26 AM IST

KCR Medchal Jadcherla Tour Today : ఎన్నికల రణంలో గులాబీదళం దూసుకెళ్తోంది. ప్రచారానికి బీఆర్​ఎస్​ మూడంచెల వ్యూహం అనుసరిస్తోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుడిగాలి పర్యటనలతో ప్రజాశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత ముఖ్య నేతలు ప్రచారాన్ని ప్రభావితం చేస్తున్నారు. అభ్యర్థులు నేరుగా ప్రజలను కలిసి ఓట్లడుగుతున్నారు. నియోజకవర్గాల ఇంచార్జీలు రంగంలోకి దిగి ప్రచార ప్రణాళికలు, శ్రేణులను సమన్వయం చేస్తున్నారు. బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్.. నేడు జడ్చర్ల, మేడ్చల్ సభల్లో పాల్గొననున్నారు. బీఫారాలను ఇప్పటి వరకు 90 మందికి ఇవ్వగా.. మరో 19 మందికి ఇవ్వాల్సి ఉంది.

Telangana Assembly Elections 2023
CM KCR Election Campaign 2023

KCR Medchal Jadcherla Tour Today ప్రచారంలో కారు జోరు.. నేడు జడ్చర్ల, మేడ్చల్​లో కేసీఆర్​ సభలు

KCR Medchal Jadcherla Tour Today : అభ్యర్థుల ప్రకటనలో మిగతా పార్టీల కంటే ముందడుగు వేసిన బీఆర్​ఎస్.. ప్రచారంలోనూ తనదైన శైలితో దూసుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు గులాబీ పార్టీ నెలల క్రితమే సిద్ధమైంది. సభ్యత్వ నమోదు, ఆత్మీయ సమ్మేళనాలు, పార్టీ కార్యవర్గాల ఏర్పాటు, కార్యాలయాల నిర్మాణం వంటి కార్యక్రమాలతో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభాలు, శంఖుస్థాపనలతో ప్రజల్లోకి వెళ్లింది. సెంటిమెంట్లను విశ్వసించే బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్‌(BRS).. శ్రావణమాసం ప్రారంభం రోజు.. ఒకేసారి 115 మంది అభ్యర్థులతో తమ సైన్యాన్ని ప్రకటించారు. అసమ్మతి, అసంతృప్తులను కొన్నిచోట్ల బుజ్జగించి.. మరికొన్ని చోట్లపట్టించుకోకుండా తేలిగ్గా తీసుకుంది.

BRS Election Campaign Telangana 2023: అభ్యర్థుల ఖరారు పార్టీలో సర్దుబాట్ల కొలిక్కి రాగానే.. ప్రచారంపై దృష్టి సారించింది. ఇప్పటికే అభ్యర్థులకు ప్రచార సామాగ్రి చేరవేసింది. గడువు ముగిసేలోగా ప్రతి ఓటరును కనీసం మూడు, నాలుగుసార్లు కలవాలని అభ్యర్థులకు పార్టీ నాయకత్వం దిశా నిర్దేశం చేసింది. మిగతా పార్టీలు అభ్యర్థులను ప్రకటించేలోపే సగం ప్రచారం చేయాలన్న అధిష్టానం వ్యూహంతో.. అభ్యర్థులు ప్రజల బాటపట్టి.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టికెట్లు(MLA Tickets) ప్రకటించగానే అసంతృప్తులు, అసమ్మతి నేతలతో పాటు మండల స్థాయి నాయకులను కలిసి మద్దతు కోరారు.

BRS Election Campaign in Telangana : మ్యానిఫెస్టో ప్రకటనతో జోరందుకున్న బీఆర్ఎస్ నాయకుల ప్రచారాలు.. ఎన్నికల రథాలతో బరిలోకి అభ్యర్థులు

CM KCR Jadcherla Tour Today : కాలనీలు, బస్తీ, కుల సంఘాల పెద్దలను కోరి ఆశీర్వదించండని అభ్యర్థిస్తున్నారు. కాలనీల్లో పాదయాత్రలు, పర్యటనలతో అభ్యర్థులు తీరిక లేకండా గడుపుతున్నారు. నియోజకవర్గాల ఇంచార్జీలు రంగంలోకి దిగారు. అభ్యర్థులు, ఇతర నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం చేస్తూ.. ప్రచార ప్రణాళికలను(Election Campaign) పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ మళ్లీ గెలిస్తే చేయబోయే పనులపై హామీ ఇస్తున్నారు. కేసీఆర్‌కి జ్వరం వచ్చిన సమయంలో కేటీఆర్​, హరీశ్‌రావు, కవిత ముమ్మర ప్రచారం నిర్వహించారు. కేటీఆర్​, హరీశ్‌రావు(Harish Rao) ఇద్దరూ కలిసి సుమారు 60 నియోజకవర్గాల్లో వరస పర్యటనలు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై కవిత దృష్టిసారించారు.

CM KCR Medchal Tour Today : అభివృద్ధి పనుల ప్రారంభం.. పార్టీ సభలు నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చినప్పటి నుంచి వ్యూహాలకు బీఆర్​ఎస్​ మరింత పదును పెట్టింది. ఈనెల 15న కేసీఆర్ రంగంలోకి దిగారు. మేనిఫెస్టో ప్రకటించి అభ్యర్థులకు బీఫారాలు(B Forms) ఇవ్వడంతో పాటు హుస్నాబాద్‌లో ప్రచారభేరీ మోగించారు. నవంబరు 9 వరకు రోజుకు రెండు లేదా మూడు నియోజకవర్గాల చొప్పున 41 సభల్లో పాల్గొనేలా షెడ్యూల్‌ ప్రకటించారు. ఇప్పటికే హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్ధిపేటలో ప్రజాఆశీర్వాద సభలకు హాజరైన గులాబీ దళపతి కేసీఆర్‌.. ఇవాళ జడ్చర్ల, మేడ్చల్‌లో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ప్రతీసభకు లక్ష మంది జనసమీకరణను లక్ష్యంగా పెట్టుకుంది. ప్రచారం ముగిసే వరకు పకడ్బందీగా ప్రచారం చేసేలా గులాబీ పార్టీ ప్రణాళికలు రచించింది.

CM KCR Siddipet Sircilla Tour Today : ప్రచారంలో కేసీఆర్ దూకుడు.. నేడు KTR, హరీశ్ రావు ఇలాకాలో సభలు

CM KCR Praja Ashirvada Sabha Today : బీఆర్​ఎస్​ అభ్యర్థులకు బీఫారాల పంపిణీ కొనసాగుతోంది. ఈనెల 15న 69 మంది 16న 29మందికి కేసీఆర్ బీఫారాలు ఇచ్చారుయ. మంగళవారం చొప్పదండి అభ్యర్థి సుంకే రవిశంకర్‌కి ఇచ్చారు. మరో 19 మందికి బీఫారాలు ఇవ్వాల్సి ఉంది. నర్సాపూర్, మల్కాజిగిరి, గోషమాహల్, నాంపల్లి అభ్యర్థులను అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించ లేదు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత.. అవసరమైతే ఒకరిద్దరిని మారుస్తారనే ప్రచారం నేపథ్యంలో.. పార్టీ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

CM KCR Speech at Siddipet Praja Ashirwada Sabha : 'ఈ ఎన్నికల్లో లక్ష మెజార్టీ రికార్డును సిద్దిపేట ప్రజలు బద్దలుకొట్టాలి

CM KCR Speech at Sircilla Public Meeting : 'ధరణి ఉండాలో.. రద్దు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.