ETV Bharat / state

CM KCR Siddipet Sircilla Tour Today : ప్రచారంలో కేసీఆర్ దూకుడు.. నేడు KTR, హరీశ్ రావు ఇలాకాలో సభలు

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 17, 2023, 7:58 AM IST

CM KCR Siddipet Sircilla Tour Today : చేరికలపై గులాబీ పార్టీ దృష్టి సారించగా.. టికెట్​ ఆశించి భంగపడిన పలువురు అసంతృప్త నేతలు బీఆర్​ఎస్​ను వీడుతున్నారు. ఇప్పటివరకు 98 మంది అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వగా.. మరో 20మందికి ఇవాళ పంపిణీ చేయనున్నారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు స్థానాలపై ఇవాళ ఉత్కంఠ వీడనుంది. ప్రచారంలో జోరు పెంచిన బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్.. నేడు కేటీఆర్, హరీశ్‌రావు నియోజకవర్గాలైన సిరిసిల్ల, సిద్దిపేటలో ప్రజాశీర్వాద సభల్లో పాల్గొననున్నారు.

BRS 4 Tickets Issue
CM KCR Praja Ashirvada Sabha in Sircilla

CM KCR Praja Ashirvada Sabha KTR హరీశ్​రావు నియోజకవర్గాల్లో KCR సభ.. నేడే 4 సీట్లపై క్లారిటీ

CM KCR Siddipet Sircilla Tour Today : బీఆర్ఎస్​లో అసమ్మతులు, అసంతృప్తుల తిరుగుబాటు కొనసాగుతూనే ఉంది. అభ్యర్థులను ప్రకటించిన రోజు పలు నియోజకవర్గాల్లో కొందరు నేతలు అసంతృప్తి గళం విప్పారు. కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్‌రావు రంగంలోకి దిగి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అధిష్టానం జోక్యంతో.. పలుచోట్ల పరిస్థితి సద్దుమణిగినా కొన్నిచోట్ల అలాగే కొనసాగుతోంది. వేములవాడలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌తో మాట్లాడిన కేసీఆర్​.. ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు.

BRS MLA Ticket Disputes 2023 : స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి, సిట్టింగ్ ఎమ్మెల్యేరాజయ్య మధ్య కేటీఆర్ సయోధ్య కుదిర్చి.. రాజయ్యని రైతుబంధు సమితి అధ్యక్షుడిని చేశారు. జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చి.. పల్లా రాజేశ్వర్‌రెడ్డితో సర్దుబాటు చేశారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవికి ఇచ్చి పార్టీ వీడకుండా జాగ్రత్తపడ్డారు. ఐతే పలు నియోజకవర్గాల్లో మాత్రం అసంతృప్తితో పలువురు నేతలు పార్టీని వీడారు.

Disputes in Warangal BRS Leaders : గులాబీవనంలో గుబులు.. సొంత పార్టీ నేతల మధ్య లోపించిన సఖ్యత

CM KCR Public Meeting Siddipet 2023 : ఎన్నికల వేడి మొదలైన కొన్ని రోజులకే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy), జూపల్లి కృష్ణారావు బీఆర్​ఎస్​ని వీడారు. పాలేరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డికే మళ్లీ అవకాశం ఇవ్వడంతో మాజీ మంత్రి తుమ్మల కాంగ్రెస్‌లో చేరారు. కొద్దిరోజుల క్రితం కేసీఆర్ సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరిన.. భువనగిరి కాంగ్రెస్ నేత కంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి సొంతగూటికి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, రేఖానాయక్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీని వీడారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నోముల వీరేశం, కరీంనగర్‌లో మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌రెడ్డి బీఆర్​ఎస్​కు రాజీనామా చేశారు. అంబర్‌పేటలో మాజీ మంత్రి కృష్ణయాదవ్ కారు దిగి బీజేపీలో చేరారు.

CM KCR Public Meeting Siddipet : రంగారెడ్డి డీసీసీబీ ఛైర్మన్ మనోహర్‌రెడ్డి, ములుగులో మాజీమంత్రి చందులాల్ కుమారుడు ప్రహ్లాద్ బీఆర్​ఎస్​ని వీడారు. తాజాగా నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, పఠాన్‌చెరు అసంతృప్త నేత నీలం మధు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. జీహెచ్​ఎంసీ ఫ్లోర్‌లీడర్‌గా నియమించినా.. కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఆయన భార్య పూజిత పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అసంతృప్తితోనే ఉన్నారు. ఎమ్మెల్సీ కూచుకుంట్ల దామోదర్‌రెడ్డి కుమారుడు కాంగ్రెస్‌లో చేరి నాగర్‌కర్నూలు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

BRS Special Strategy against Disgruntled Leaders : అసంతృప్తులపై బీఆర్‌ఎస్ ప్రత్యేక వ్యూహం.. సొంత పార్టీ నేతలకు సముదాయింపు.. కాంగ్రెస్‌ నాయకులపై ఆకర్షణ మంత్రం

టికెట్ ఆశించిన జీహెచ్​ఎంసీ మాజీమేయర్ బొంతు రామ్మోహన్.. ఉప్పల్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అభ్యర్థిత్వంపై చందర్‌రావు, శశిధర్ రెడ్డి ఇంకా భగ్గుమంటూనే ఉన్నారు. నాగార్జునసాగర్‌లో నోముల భగత్, ఆలంపూర్‌లో అబ్రహంపై అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. అసంతృప్తులు పార్టీని వీడుతుండగా.. చేరికలపై పార్టీ దృష్టి పెట్టింది. మాజీ మంత్రి, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య గులాబీకండువా కప్పుకున్నారు. మైనంపల్లి హన్మంతరావు.. ఆయన కుమారుడు రోహిత్‌కి కాంగ్రెస్ టికెట్(Congress Ticket) ఖరారు కాగానే.. మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ను చేర్చుకొని వెంటనే ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు.

BRS Election Campaign 2023 : మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారి తిరుపతిరెడ్డి బీఆర్​ఎస్​లో చేరగా.. మెదక్ నియోజకవర్గ ఇంచార్జీగా బాధ్యతలు అప్పగించారు. అంతకు ముందు తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్​ఎస్​లో చేరగా.. భద్రాచలం టికెట్ ఇచ్చారు. భద్రాద్రి జిల్లా బీజేపీ(BJP) అధ్యక్షుడు చిన్న సత్యనారాయణ, వైటీపీ నాయకుడు, గాయకుడు ఏపూరి సోమన్న, దేవరకొండ నాయకుడు బిల్యా నాయక్ పార్టీలో చేరారు. త్వరలో చాలామంది ప్రముఖులు పార్టీలో చేరనున్నట్లు కేటీఆర్​ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలో టికెట్ దక్కని నేతలను ఆకర్షించేందుకు గులాబీ పార్టీ వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

CM KCR Election Campaign Vehicle : ఎన్నికలకు కేసీఆర్ ప్రచారరథం సిద్ధం.. హుస్నాబాద్​లో తొలి శంఖారావం

KCR Distributes B Forms : అభ్యర్థులకు బీఆర్​ఎస్​ బీఫారాలు అందిస్తోంది. ఆదివారం 69, సోమవారం 29 మందికి.. సీఎం కేసీఆర్ బీఫారాలిచ్చారు. మిగిలిన 21 మందికి.. ఇవాళ బీఫారాలు ఇవ్వనున్నారు. మల్కాజిగిరి, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి స్థానాలపై కొనసాగుతున్న ఉత్కంఠ నేడు వీడనుంది. నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కేసీఆర్, హరీశ్‌రావు ఇప్పటికే చర్చించారు. ఆ స్థానాన్ని మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి, గోషామహల్ నందకిషోర్ వ్యాస్ బిలాల్, నాంపల్లి ఆనంద్ కుమార్‌గౌడ్‌కు ఖాయమైనట్లు సమాచారం.

బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్ ప్రచారం.. జోరుగా సాగుతోంది. హుస్నాబాద్‌లో ప్రచారం ప్రారంభించిన గులాబీ దళపతి జనగామ, భువనగిరిలో పర్యటించారు. ఇవాళ కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల.. హరీశ్‌రావు నియోజకవర్గం సిద్ధిపేటలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు హాజరుకానున్నారు. కేటీఆర్, హరీశ్​రావు నియోజకవర్గాలైనందున.. భారీ జనసమీకరణకు పార్టీ కసరత్తు చేస్తోంది. లక్ష మందితో సభ నిర్వహించనున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు.

Station Ghanpur assembly constituency issue : స్టేషన్​ఘన్​పూర్​లో రాజుకున్న రాజకీయవేడి.. టికెట్​పై ఎవరికి వారు ధీమా..!

CM KCR Meeting with BRS MLA Candidates : 51 మందికి బీ ఫారాలు.. అందరినీ కలుపుకుని పోవాలని అభ్యర్థులకు కేసీఆర్ సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.