ETV Bharat / state

హథ్రాస్​ ఘటనకు నిరసనగా.. కాంగ్రెస్ సత్యాగ్రహం

author img

By

Published : Oct 6, 2020, 9:45 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్​ ఘటనను నిరసిస్తూ.. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ కార్యక్రమం నిర్వహించారు. జిల్లెలగూడ కూడలిలోని అంబేద్కర్​ విగ్రహానికి​ పూలమాల వేసి.. అక్కడే నిరసనకు దిగారు. హథ్రాస్​ ఘటనపై ప్రశ్నించడానికి వెళ్లిన రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీలపై దాడిని తీవ్రంగా ఖండించారు.

హథ్రాస్​ ఘటనకు నిరసనగా.. కాంగ్రెస్ సత్యాగ్రహం
Congress Party Sthyagrham Against Hthras Issue

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్​ గ్యాంగ్​రేప్ ఘటనను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా పరిధిలోని జిల్లెలగూడలో కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ నిరసన తెలియజేశారు. బాధితులకు మద్ధతు తెలిపి.. ఘటనపై ప్రశ్నించిన రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు జిల్లా పార్టీ అధ్యక్షులు చల్లా నర్సింహరెడ్డి తెలిపారు.

దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని కాంగ్రెస్​ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మొయినాబాద్​లో మైనారిటీ యువతిపై తెరాస నాయకుడు అత్యాచారానికి పాల్పడితే.. చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రక్షణ మీద దృష్టి పెట్టాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్​, కొండా విశ్వేశ్వర్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'ఎవరూ డబ్బులు కట్టకండి... ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.