కుటుంబ పార్టీలను ఓడించాలి- అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తాం : జేపీ నడ్డా

కుటుంబ పార్టీలను ఓడించాలి- అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తాం : జేపీ నడ్డా
JP Nadda Election Campaign in Telangana : రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కుటుంబ పార్టీ పాలనను ఓడించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బీఆర్ఎస్ అంటేనే అవినీతి, రాక్షసుల పార్టీ అని విమర్శించారు. రాష్ట్రంలోని జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీనే.. ముఖ్యమంత్రిగా చేస్తామని నడ్డా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. నారాయణపేట సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు.
JP Nadda Election Campaign in Telangana : ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ భారతీయ జనతా పార్టీ.. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి పలు దఫాలుగా రాష్ట్రానికి వచ్చి ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేయగా.. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సకల జనుల విజయ సంకల్ప సభ పేరుతో నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు.
JP Nadda Telangana Tour : తెలంగాణలో ఉన్న అధికార పార్టీపై జేపీ నడ్డా పలు విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో (TELANGANA ELECTIONS) కేసీఆర్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేవలం కేసీఆర్(KCR) కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరిందని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలాలు ప్రజలకు అందలేదని తెలిపారు. జమ్మూకశ్మీర్, బిహార్, యూపీ, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో కుటుంబపార్టీలు ఉన్నాయని.. రాబోయే ఎన్నికల్లో కుటుంబ పార్టీ పాలనను ఓడించాలని కోరారు.
JP Nadda Comments on Kaleshwaram Project : వచ్చే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలని జేపీ నడ్డా(JP Nadda) స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ అధికంగా నిధులు కేటాయించారని తెలిపారు. బీఆర్ఎస్(BRS) అంటే అవినీతి, రాక్షసుల పార్టీ అని అన్నారు. తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు అంతా వారిదే రాజకీయ అధికారమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ ద్వారా పేదల భూములు దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎంలా మారిందని తెలిపారు.
"కేసీఆర్ అవినీతి వల్ల కేంద్రం ఇచ్చే నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. తెలంగాణ ప్రగతి కోసం కేంద్ర నిధులు వినియోగించడం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ రద్దు చేశాం. తెలంగాణలో రద్దు చేయలేదు. తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉంది. కేసీఆర్ అవినీతి వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. ధరణి పోర్టల్ ద్వారా పేదల భూములు దోచుకున్నారు."- జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
BJP Election Campaign in Telangana Today : కేసీఆర్ అవినీతి వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని బీజేపీ నాయకుడు జేపీ నడ్డా మండిపడ్డారు. మియాపూర్ భూముల్లో రూ.4 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. దళితబంధులో ఎమ్మెల్యేలకు 30 శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని అన్నారు. కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తామని అన్నారు. తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉందని వెల్లడించారు.
