ETV Bharat / state

JP Nadda Tour In Telangana : 'బీఆర్​ఎస్​తో రాజీలేదు.. సీరియస్​ ఫైట్ మాత్రమే చేయాలి'

author img

By

Published : Jun 25, 2023, 9:38 AM IST

Updated : Jun 25, 2023, 8:01 PM IST

JP Nadda
JP Nadda

JP Nadda Telangana Tour Today : అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర నేతలకు కమల దళపతి జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. పార్టీ లైన్ దాటి నాయకులు ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించారు. పార్టీ లైన్ క్రాస్ చేస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా పనిచేయాలన్న నడ్డా బీఆర్​ఎస్​తో రాజీలేదని సీరియస్ ఫైట్ ఉంటుందని స్పష్టం చేశారు.

JP Nadda Tour In Telangana Today : బీఆర్​ఎస్​తో ఇక రాజీలేదని.. సీరియస్​ ఫైట్​ మాత్రమే ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. హైదరాబాద్​ చేరుకున్న నడ్డా.. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై రాష్ట్ర నేతలతో చర్చించారు. ఈ మేరకు బండి సంజయ్​, కిషన్​రెడ్డి, లక్ష్మణ్​, విజయశాంతి, రఘునందనరావు, పొంగులేటి సుధాకర్​ రెడ్డితో ఆయన చర్చలు జరిపారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ లైన్​ దాటి మాట్లాడవద్దని నేతలకు ఆదేశించారు. అలాగే పార్టీ లైన్​ దాటితే చర్యలు తప్పవని కూడా నడ్డా హెచ్చరించారు. అందరి ఎజెండా రాష్ట్రంలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా పెట్టుకొని.. పని చేయాలని సూచించారు.

JP Nadda Comments On Brs : రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం అనంతరం సంపర్క్ సే సమర్థన్ ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ నివాసానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్​తో కలసి వెళ్లారు. మోదీ 9 ఏండ్ల పాలనలో చేసిన విజయాలను వివరించడంతోపాటు మోదీ ప్రభుత్వం సాధించిన ప్రగతి పుస్తకాలను ప్రొఫెసర్ నాగేశ్వర్​కు నడ్డా అందజేశారు. అక్కడి నుంచి ఫిల్మ్ నగర్​లోని పద్మశ్రీ అవార్డు గ్రహీత, నృత్య కళాకారిణి ఆనంద శంకర జయంతి నివాసానికి చేరుకున్నారు. నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనను వివరించడంతో పాటు మోదీ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై పుస్తకాలను అందజేశారు. సంపర్క్ సే సంవర్థన్ కార్యక్రమాన్ని ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

నాగర్​కర్నూల్​ సభలో పాల్గొన్న జేపీ నడ్డా : అక్కడి నుంచి హెలికాప్టర్​లో నాగర్ కర్నూల్​కు బయల్దేరారు. సాయంత్రం 5 గంటలకు నాగర్ కర్నూల్ నవ సంకల్ప సభ స్థలికి చేరుకుని ప్రసంగించారు. నరేంద్ర మోదీ తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధి, సాహసోపేతమైన నిర్ణయాలను ప్రజలకు వివరిస్తూనే.. కేసీఆర్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. సభ ముగించుకుని హెలికాప్టర్​లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి బయల్దేరి వెళ్లారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత నిస్తేజంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో జేపీ నడ్డా రాష్ట్ర పర్యటన నూతన ఉత్తేజాన్ని నింపిందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

BJP Public Meeting in Nagarkurnool Today : నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశ వ్యాప్తంగా మహా జన్ సంపర్క్ అభియాన్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహా జన్ సంపర్క్ అభియాన్​లో భాగంగా బీజేపీ నాగర్ కర్నూల్ లో నవ సంకల్ప సభ పేరుతో బహిరంగ సభను నిర్వహించింది. నాగర్ కర్నూల్ సభలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మధ్యాహ్నం 12:30కీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, మురళీధర్ రావు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా నోవాటెల్ హోటల్​కు చేరుకున్నారు. పార్టీ ముఖ్య నేతలతో లంచ్ మీటింగ్ అయిన నడ్డా తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, విజయశాంతి, రఘునందనరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డితో గంట పాటు చర్చించారు.

ఇవీ చదవండి :

Last Updated :Jun 25, 2023, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.