ETV Bharat / state

Nalgonda Congress Politics : ఉమ్మడి నల్గొండ జిల్లాలో.. కాంగ్రెస్​కు చెక్​ పెట్టేలా BRS ప్లాన్

author img

By

Published : Jul 25, 2023, 9:51 AM IST

Nalgonda Congress Politics updates : ఉమ్మడి నల్లగొండ జిల్లా.. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. రాష్ట్ర కాంగ్రెస్ దిగ్గజాలన్ని ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలే. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో దూకుడు పెంచిన హస్తం పార్టీకి.. బీఆర్ఎస్ చెక్‌ పెట్టేలా వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్‌కి చెందిన కీలక నేతలను పార్టీలోకి బీఆర్ఎస్ ఆహ్వానిస్తోంది.

BRS Focus on New Joinings
BRS Focus on New Joinings

ఉమ్మడి నల్గొండ జిల్లాలో హస్తంకి షాక్.. చెక్ పెట్టేలా బీఆర్ఎస్ వ్యూహాలు

Nalgonda Congress Leaders Join BRS : యాదాద్రి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, భువనగిరి కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి అనిల్‌ కుమార్‌రెడ్డి బీఆర్ఎస్​లోకి వెళ్లడంతో రాష్ట్రంలోనే సంస్థాగతంగా బలంగా ఉన్న జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి నల్గొండలో.. ఆ పార్టీకి షాక్‌ తగిలింది. భువనగిరిలో నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన అనిల్‌.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీకి నష్టం కలిగిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

Congress Leader Joins BRS Party : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీచేసి ఓడిపోయిన అనిల్‌ కుమార్‌రెడ్డి.. ఎంపీ కోమటిరెడ్డికి మధ్య చాలాకాలంగా విభేదాలున్నాయి. ఇటీవల ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన.. నియోజకవర్గంలో బీసీవాదం పేరుతో పలువురు అసమ్మతి కార్యక్రమాలు చేస్తుండటంతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దాని వెనక ఎంపీ కోమటిరెడ్డి ఉన్నారని బాహాటంగానే విమర్శిస్తున్నారు. పీసీస మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి అనిల్‌ అనుచరుడిగా ఉన్నారు. భువనగిరి అసెంబ్లీ నుంచి.. ప్రస్తుతం శేఖర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, తిరిగి ఆయనకే అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. అనిల్‌ కుమార్​రెడ్డికి ఎంపీ టికెట్‌ హామీ లభించినట్లు సమాచారం.

"అనిల్ కుమార్​రెడ్డికి రాజకీయ భవిష్యత్​ చాలా బాగుంటుంది. ఇవాళ యాదాద్రి భువనగిరిలో పార్టీ జిల్లా కేంద్రం పెట్టుకున్నాం. యాదాద్రిని బాగా అభివృద్ధి చేశాము. ఇంకా అక్కడ జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి. శేఖర్​రెడ్డి, అనిల్​ కుమార్​రెడ్డి ఇద్దరు కలిసి ఆ జిల్లాలో అద్భుతంగా పని చేయాలని కోరుతున్నా. శేఖర్​రెడ్డికి చెబుతున్నా.. పాతవాళ్లు, కొత్తవాళ్లు అని పొంతనలు పెట్టుకోవద్దు.. ఇద్దరు గౌరవించుకుంటూ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ప్రజలకు సేవ చేస్తేనే వారికి గుర్తుంటది.. అందరూ పాలన మంచిగా ఉంది అనుకోవాలి." -కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి

Bhuvanagiri DCC Chief Anil Kumar Reddy Joins BRS : అనిల్‌ కుమార్​రెడ్డి చేరికతో యాదాద్రి జిల్లాలో.. బీఆర్ఎస్​కి కొత్తబలం వచ్చినట్లు అయ్యిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. పాత, కొత్త నేతలంతా కలిసి సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు సీనియర్‌ నేతలు త్వరలోనే తమ పార్టీలో చేరనున్నారని బీఆర్ఎస్ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ఆగస్టు 13, 14న రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ముగ్గురు కీలక నేతలు పార్టీలో చేరుతారని పేర్కొన్నారు.

New Joinings in BRS Party : ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన.. పలువురు బీఆర్ఎస్ అసమ్మతి నేతలు ఇటీవల కాంగ్రెస్‌లో చేరుతామని సుముఖత వ్యక్తం చేయగా.. వారిని చేర్చుకునేందుకు అధిష్ఠానం ఆసక్తి చూపలేదని కాంగ్రెస్‌ మాజీమంత్రి తెలిపారు. నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులంతా రిజర్వు అయ్యారని, ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి ఖాళీ లేదని ఇటీవల ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం తీవ్ర కలకలం రేపింది. పార్టీ బలహీనంగా ఉన్న రెండు నియోజకవర్గాల్లో ఇతర పార్టీ నేతలను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికార పార్టీ నేత వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.