ETV Bharat / state

SBI Bank Employee Fraud : బ్యాంక్​ ఉద్యోగే.. దొంగయ్యాడు.. ఖాతాలో రూ.14 లక్షలు మాయం

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2023, 3:55 PM IST

SBI Bank Employee Fraud in Nagarkurnool : బయట నగదు ఉంటే ఖర్చు అవుతుందని.. భద్రతగా ఉంటాయని ఖాతాదారులు బ్యాంక్​లో డిపాజిట్ చేసుకుంటారు. అలా ఓ వ్యక్తి బ్యాంక్​లో సుమారు రూ.14 లక్షలు దాచుకున్నాడు. డబ్బులు అవసరమై తీసుకునేందుకు బ్యాంక్​కు వెళ్లాడు. కావల్సిన పత్రాలు ఇచ్చిన తరవాత.. క్యాషియర్​ చెప్పిన మాటలు విని షాక్​ అయ్యాడు. సీన్​ కట్​ చేస్తే.. బ్యాంక్​ ఉద్యోగే.. దొంగయ్యాడని తేలింది. ఈ విషయం తెలిసిన బాధితుడు తన డబ్బులు ఇవ్వాలని ఆందోళన చేపట్టగా.. మేనేజర్​ భరోసా ఇవ్వడంతో నిరసన విరమించుకున్నాడు.

14 Lakh Fraud Bank Employee in Nagarkurnool
SBI Bank Employee Fraud Case in Atchampeta

SBI Bank Employee Fraud in Nagarkurnool : నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎస్బీఐలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. ఖాతాదారుడి సొమ్మును.. సొంత ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. మరో బాధితురాలికి నకిలీ ఎఫ్‌డీ పత్రం(Duplicate FD document) ఇచ్చి మోసగించాడు. బాధితులు అందోళనకు దిగడంతో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని ఉప్పునుంతల మండలం తాడూరు గ్రామానికి చెందిన వినోద్‌కుమార్‌కు అచ్చంపేట పట్టణంలోని స్టేట్​ బ్యాంక్​లో అకౌంట్​ ఉంది. అందులో రూ.14.73 లక్షలు ఉన్నాయి. గత నెల 29న ఆ వ్యక్తి బ్యాంక్​కు వెళ్లి రూ.లక్ష తీసుకునేందుకు దరఖాస్తును సమర్పించాడు. దాన్ని పరిశీలించిన క్యాషియర్​ ఖాతాలో లక్ష రూపాయలు లేవని చెప్పాడు. ఈ విషయం విన్న ఖాతాదారుడు షాక్​ గురయ్యాడు. ఈ విషయమై 30న రాతపూర్వకంగా మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు.

State Bank Employee Cheat Customer : అసలు నిజం తెలుసుకునేందుకు మేనేజర్​ ఖాతాను పరిశీలించాడు. అకౌంట్​లో సెప్టెంబర్​ 5న ఒకసారి రూ.6 లక్షలు, మరో విడత రూ.5 లక్షలు.. 6వ తేదీన రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.14 లక్షలు ఆ బ్యాంకులో పనిచేసే ఉద్యోగి ఖాతా(Bank Employee)కు బదిలీ అయ్యాయని అంతర్గత విచారణలో గుర్తించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, సొమ్ము ఖాతాలో జమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చిన బ్యాంకు అధికారులు.. తర్వాత స్పందించడం లేదంటూ బాధిత కుటుంబ సభ్యులు స్థానిక సర్పంచి భర్త కృష్ణయ్య ఆధ్వర్యంలో మంగళవారం బ్యాంకు వద్ద ఆందోళనకు దిగారు. తమ కుటుంబ సభ్యుడు అనారోగ్యంతో ఉన్నాడని.. వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణమే రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశాడు.

ఎస్‌బీఐ బ్రాంచిలో కోట్ల నగదు సహా ఆభరణాలు మాయం.. తీరాచూస్తే..!

14 Lakh Fraud Bank Employee in Nagarkurnool : బ్యాంకులో ఖాతాదారుడు చేస్తున్న ఆందోళనను అక్కడ ఉన్న సిబ్బంది.. సెలవులో ఉన్న బ్రాంచి మేనేజర్​ హుసేన్​ బాషాకి తెలియజేశారు. ఆయన వెంటనే ఫోన్​లో బాధితులతో మాట్లాడి.. ధైర్యం చెప్పారు. ఓ ఉద్యోగి పొరపాటు చేసిన విషయం వాస్తవమేనని, విచారణ కొనసాగుతోందని, న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.

Bank Employee 4 Lakh Fraud on FD Deposit : అచ్చంపేట మండలంలోని నడింపల్లి గ్రామ వాసి శ్రీనివాసులు మృతి చెందడంతో ప్రభుత్వం నుంచి రైతు బీమా పరిహారం రూ.5 లక్షలు మంజూరైంది. వాటిలో తన భార్య అనిత ఖాతాలో మే 2న అచ్చంపేట స్టేట్​ బ్యాంక్​లో రూ.4 లక్షలు ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేశారు. ఈ మేరకు బ్యాంక్​ ఉద్యోగి ఆమెకు నిర్ధారణ పత్రాన్ని అందజేశారు. ‘ఆ బాండ్ తనఖాతో కొంత మొత్తాన్ని రుణంగా పొందేందుకు తాను సెప్టెంబరు 15న బ్యాంకుకు వచ్చానని.. సదరు పత్రాన్ని పరిశీలించిన బ్యాంకు సిబ్బంది అది నకిలీదని చెప్పారని’ మంగళవారం బ్యాంకుకు వచ్చిన బాధితురాలు కన్నీటిపర్యంతమయింది. ఈ విషయాన్ని అప్పుడే బ్యాంక్​ మేనేజర్​కి తెలిపింది. అయన విచారించి.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని.. ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

అప్పులిస్తామని ఆశ చూపారు.. అంతా దోచుకోని సైలెంటైపోయారు..

మేనేజర్‌ ఉద్యోగమంటే బ్యాంకు మనదే అనుకున్నాడు.. చివరికి..

దేనా బ్యాంకుకు కుచ్చుటోపీ.. రుణం పేరుతో రూ.3 కోట్ల టోకరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.