ETV Bharat / crime

అప్పులిస్తామని ఆశ చూపారు.. అంతా దోచుకోని సైలెంటైపోయారు..

author img

By

Published : Sep 16, 2022, 10:16 AM IST

Bluffing : ప్రజలకు మాయ మాటలు చెప్పి.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన పుట్టింది వారికి. ఆలోచన వచ్చిందే తడవుగా ఓ పథకం వేశారు. అమాయకులకు ఉండే డబ్బు ఆశతో, డబ్బును సృష్టించాలనుకున్నారు. అంతా కలిసి ఓ డొల్ల కంపెనీ తెరిచారు. మెుదట రూ. 500తో అకౌంట్ తెరిపించి అప్పులు ఇస్తామని నమ్మించారు. ఆ తరువాత అప్పు ఇవ్వాలంటే5 వేల‌ను ఇన్వెస్ట్ చేయాల‌ని తెలిపారు. డబ్బు అవసరం ఉన్న చాలాంది వారుచెప్పినట్లే, 5వేలు అకౌంట్ వేశారు. తీరా లోన్ కోసం డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లితె మోసపోయామని తెలిసి బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.

అప్పులిస్తామని ఆశ చూపారు.. అంతా దోచుకోని సైలెంటైపోయారు..
అప్పులిస్తామని ఆశ చూపారు.. అంతా దోచుకోని సైలెంటైపోయారు..

A huge fraud in the name of Loan app : ఏపీ అనంతపురం జిల్లాలో తక్కువ వడ్డీకే రుణాల పేరిట అమాయకుల్ని మోసం చేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తుల్ని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. మాసే మునీంద్ర అనే వ్యక్తి తన భార్య, తమ్ముడు, తండ్రి, తల్లి తదితర కుటుంబసభ్యుల్ని డైరెక్టర్లుగా పేర్కొంటూ అనంతపురంలో, ఎల్.డీ ఆర్.కే నిధి లిమిటెడ్‌ అనే సంస్థను ఏర్పాటు చేశాడు.

కొంతమంది ఉద్యోగుల్ని చేర్చుకుని... వారి ద్వారా వినియోగదారులతో 500 రూపాయలతో ఖాతాలు తెరిపించాడు. తక్కువ వడ్డీకే అప్పులు ఇస్తామని చెప్పి, అందుకు 5 వేల రూపాయల నగదు అవసరమని, అందరి చేత డిపాజిట్‌ చేయించాడు. ఈ లావాదేవీల కోసం ఎల్.డీ ఆర్.కే నిధి అనే మొబైల్ యాప్‌ను రూపొందించాడు. డబ్బులు కట్టిన నగరానికి చెందిన అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి తన ఖాతాలోని 70 వేలు డ్రా చేసేందుకు యత్నించాడు.

నగదు రాకపోవడంతో సందేహంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో ఆర్ధిక మోసానికి పాల్పడుతున్నట్లు తెలింది. తీగ లాగితే డొంక కదులుతుందన్న చందంగా వీరి వ్యవహారం బట్టబయలైంది. ఎల్.డీ ఆర్.కే నిధి లిమిటెడ్ సంస్థ పేరుతో కెనరా బ్యాంకులో ఖాతా ఉన్నట్లు తేల్చారు. సంస్థలో 2123 మంది ప్రజల ద్వారా స్వీకరించిన మొత్తం నగదు సుమారు రూ.16,86000 ఉండాల్సి ఉండగా బ్యాంకు ఖాతాలో కేవలం రూ.6000 మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.

ఈ కేసులో మునీంద్ర, శ్యామల, లక్ష్మీపతి శ్రీనాథ్ నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కి పంపినట్లు సీఐ తెలిపారు. మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. తక్కువ వడ్డీతో అధిక రుణాలు ఇస్తామని, ఇతరత్రా కారణాలతో నగదు ఆశ చూపి మోసం చేసే ఇలాంటి సంస్థల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.