ETV Bharat / state

కొల్లాపూర్​ను కంచుకోటగా మార్చుకున్న జూపల్లి - రాజకీయ ప్రస్థానం సాగిందిలా

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2023, 7:50 PM IST

Kollapur MLA Juppally Krishna Rao Profile
జూపల్లి కృష్ణారావు రాజకీయ ప్రస్థానం

Kollapur MLA Juppally Krishna Rao Profile : తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్న నియోజకవర్గాల్లో కొల్లాపూర్​ నియోజకవర్గం ఒకటి. ఈ ప్రాంత రాజకీయాలు ఎప్పుడూ హాట్​టాపిక్​గానే ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఎంతమంది నాయకులు బరిలో దిగినా, ఎవరు పోటీలో ఉన్నా కొల్లాపూర్​ పొలిటికల్ హిస్టరీలో రెండు దశాబ్దాలకుపైగా జూపల్లి కృష్ణారావు ప్రధానంగా కనిపిస్తారు. కొల్లాపూర్​ అంటే జూపల్లి, జూపల్లి అంటే కొల్లాపూర్​ అనేంతగా పేరు ప్రఖ్యాతలు గడించారు. ప్రస్తుత కేబినెట్​లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా స్థానం దక్కించుకున్న జూపల్లిపై ప్రత్యేక కథనం మీకోసం.

Kollapur MLA Juppally Krishna Rao Profile : జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్​లో​ 1955, ఆగస్టు 10న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశారు. కృష్ణారావు భార్య సుజన. వీరికి ఇద్దరు కుమారులు (వరుణ్ జూపల్లి, అరుణ్ జూపల్లి) ఉన్నారు. ఆయన ఒక బ్యాంకు ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించారు. క్రమంగా నిర్మాణ రంగంలోకి ప్రవేశించి విజయం సాధించారు. అనంతరం 1999లో రాజకీయాల్లోకి వచ్చారు.

Kollapur MLA Juppally Krishna Rao Political Entry : జూపల్లి 1999, 2004, 2009, 2012 ఉపఎన్నికలు, 2014లలో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గం(kollapur Constituency) నుంచి వరుసగా ఐదు సార్లు ఎన్నికైన మొదటి ఎమ్మెల్యేగా జూపల్లి కృష్ణారావు ముందు వరుసలో నిలిచారు. ఎమ్మెల్యేగా ఉంటూనే విద్యుత్​ సమస్యలపై పోరాడి జైలుకు సైతం వెళ్లారు. నలుగురు ముఖ్యమంత్రుల కేబినెట్​లో మంత్రిగా పనిచేశారు. వై.యస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఆహార, పౌర సరఫర, వ్యవహారాల శాఖల మంత్రిగా పనిచేశారు. రాజశేఖర్​ రెడ్డికి సన్నిహితంగా ఉండేవారు.

కాంగ్రెస్​ ప్రభుత్వంలో ఈమెకే తొలి ఉద్యోగం - రేవంత్​ రెడ్డి అభయహస్తం

Juppally Krishna Rao Worked BRS Government 2011 : రాజశేఖర్ రెడ్డి మరణానంతరం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఎండోమెంట్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2011 అక్టోబరు 30న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్​ఎస్​) చేరారు. ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనదైనా పాత్ర పోషించారు జూపల్లి. కొల్లాపూర్​ అంటే జూపల్లి జూపల్లి అంటే కొల్లాపూర్​ అనేంతగా పేరు ప్రఖ్యాతలు గడించారు. 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్​ఎస్​) నుంచి పోటీ చేసి గెలిచి కేసీఆర్ మంత్రివర్గంలో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. జూపల్లి కృష్ణారావు 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్ రెడ్డి (Beeram Harshavardhan Reddy) చేతిలో ఓడిపోయారు.

Juppally Krishna Rao Worked Congress Government : బీరం హర్షవర్దన్ రెడ్డి అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో పార్టీతో అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన 2023 ఏప్రిల్ 9న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్త గూడెంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్​ఎస్​ పార్టీపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను 2023 ఏప్రిల్ 10న గులాబీ పార్టీ సస్పెండ్ చేసింది.

కేసీఆర్ అణిచివేత వల్లే తెలంగాణ ప్రజలు ఒక్కటయ్యారు : ప్రొ. కోదండర

Juppally Krishna Rao : తర్వాత కాంగ్రెస్​ పార్టీ నిర్వహించిన కొల్లాపూర్​ సభ ద్వారా తిరిగి కాంగ్రెస్ (Congress Party) తీర్థం పుచ్చుకున్నారు. జూపల్లి కృష్ణారావు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి పోటీ చేసి 93,609 ఓట్లతో గెలుపొందారు. బీఆర్​ఎస్ తరఫున​ పోటీ చేసిన బీరం హర్షవర్థన్​ రెడ్డి 63,678 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. జూపల్లి 29,931 మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం రేవంత్​ రెడ్డి కేబినెట్​లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా స్థానం దక్కించుకున్నారు.

హస్తినలో కాంగ్రెస్ అగ్రనేతలతో రేవంత్​ రెడ్డి - ప్రమాణస్వీకారానికి రానున్న సోనియా గాంధీ

కొలువుదీరనున్న కొత్త కేబినెట్ - ఖమ్మం నుంచి మంత్రి పదవి ఎవరికో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.