కేసీఆర్ అణిచివేత వల్లే తెలంగాణ ప్రజలు ఒక్కటయ్యారు : ప్రొ. కోదండరాం

By ETV Bharat Telangana Team

Published : Dec 6, 2023, 5:02 PM IST

thumbnail

Kodandaram speech to Telangana Secretariat Employees : ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగుల హక్కులను గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం హరించిందని ప్రొ. కోదండరాం​ ఆవేదన చెందారు. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుందని అన్నారు. తాను ప్రభుత్వం, ఉద్యోగులకు వారధిగా ఉంటానని ఈ సందర్భంగా చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్​లోని సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించిన అనంతరం కోదండరాం మాట్లాడారు.

గత ప్రభుత్వం మీద ఆగ్రహం ఎంత ఉందో అన్నది స్పష్టంగా అర్థమవుతోందని ప్రొ. కోదండరాం అన్నారు. ఇంతటి కోపం కలుగుతుందంటే అర్థమేంటి ఈ తొమ్మిదన్నరేళ్ల సంవత్సరాలు అణిచివేత ఏ విధంగా ఉందో అర్థమవుతోందని అన్నారు. అరాచక పాలన, నిరంతరం నిఘా, నియంతృత్వ పోకడలు ఇవి మన ఆగ్రహానికి ప్రధాన కారణమని తెలిపారు.

ఇలాంటి అణచివేత ఉండబట్టే తెలంగాణ ప్రజలు ఒక్కటై కేసీఆర్​ని ఓడించారని కోదండరాం పేర్కొన్నారు. ఆదిలాబాద్​ నుంచి హైదరాబాద్​ సెక్రటేరియట్​ వరకు ఒకే రకమైన వాతావరణం ఉందన్నారు. సంఘాలు అనేవి మన మీద జూలు విదల్చడానికి ఉండకూడదు. అవి మన హక్కులను, మనల్ని సంరక్షించేవిగా ఉండాలని కోదండరామ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.