ETV Bharat / business

రూ.1లక్ష బడ్జెట్లో మంచి స్కూటర్ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్​ ఇవే! - Best Scooters Under 1 Lakh

author img

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 4:37 PM IST

top 10 Scooters Under 1 Lakh
Best Scooters Under 1 Lakh (ETV Bharat)

Best Scooters Under 1 Lakh : మీరు మంచి స్కూటీ కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్​ ఒక లక్ష రూపాయలు మాత్రమేనా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం భారత్​ టూ-వీలర్​ మార్కెట్లో చాలా బెస్ట్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలోని టాప్​-10 స్కూటీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Best Scooters Under 1 Lakh : స్కూటీలు అమ్మాయిలకు, అబ్బాయిలు అందరికీ చాలా అనువుగా ఉంటాయి. హెవీ ట్రాఫిక్​లోనూ రయ్​మని దూసుకుపోవడానికి వీలుగా ఉంటాయి. అందుకే కాలేజ్ అమ్మాయిల నుంచి గృహిణుల వరకు, కుర్రాల నుంచి పెద్దోళ్ల వరకు అందరూ స్కూటీలకే తమ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఈ ఆర్టికల్​లో రూ.1 లక్ష బడ్జెట్లో లభిస్తున్న టాప్-10 స్కూటీలపై ఓ లుక్కేద్దాం.

1. Honda Activa 6G Features : ఇండియాలోని మోస్ట్ పాపులర్​ స్కూటీల్లో హోండా యాక్టివా 6జీ ఒకటి. ఇది 5 వేరియంట్లలో, 8 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

  • ఇంజిన్​ - 109.51 సీసీ
  • పవర్​ - 7.84 పీఎస్​
  • టార్క్​ - 8.90 ఎన్​ఎం
  • మైలేజ్​ - 50 కి.మీ/లీటర్​
  • బ్రేక్స్​ - డ్రమ్​
  • కెర్బ్​ వెయిట్ - 105 కేజీ

Honda Activa 6G Price : మార్కెట్లో ఈ హోండా యాక్టివా 6జీ స్కూటీ ధర సుమారుగా రూ.76,234 నుంచి రూ.82,734 (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

2. Suzuki Access 125 Features : తక్కువ రేటులో మంచి స్కూటీ కొనాలని అనుకునేవారికి సుజుకి యాక్సెస్​ 125 మంచి ఆప్షన్ అవుతుంది. ఇది 4 వేరియంట్లలో, 15 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

  • ఇంజిన్​ - 124 సీసీ
  • పవర్​ - 8.7 పీఎస్​
  • టార్క్​ - 10 ఎన్​ఎం
  • మైలేజ్​ - 45 కి.మీ/లీటర్​
  • బ్రేక్స్​ - డిస్క్​
  • కెర్బ్​ వెయిట్ - 103 కేజీ

Suzuki Access 125 Price : మార్కెట్లో ఈ సుజుకి యాక్సెస్​ 125 స్కూటీ ధర సుమారుగా రూ.79,900 నుంచి రూ.90,500 (ఎక్స్​-షోరూం) వరకు ఉంటుంది.

3. TVS NTORQ 125 : టీవీఎస్​ కంపెనీ విడుదల చేసిన బెస్ట్ స్కూటీల్లో NTORQ 125 ఒకటి. ఇది 6 వేరియంట్లలో, 12 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

  • ఇంజిన్​ - 124.8 సీసీ
  • పవర్​ - 9.51 పీఎస్​
  • టార్క్​ - 10.6 ఎన్​ఎం
  • మైలేజ్​ - 54.33 కి.మీ/లీటర్​
  • బ్రేక్స్​ - డిస్క్​
  • కెర్బ్​ వెయిట్ - 109 కేజీ

TVS NTORQ 125 Price : మార్కెట్లో ఈ టీవీఎస్​ NTORQ​ 125 స్కూటీ ధర సుమారుగా రూ.84,636 నుంచి రూ.1.05 లక్షలు (ఎక్స్​-షోరూం) వరకు ఉంటుంది.

4. Honda Activa 125 Features : బెస్ట్ స్కూటీ కావాలని కోరుకునేవారు హోండా యాక్టివా 125 మంచి ఆప్షన్ అవుతుంది. ఇది 4 వేరియంట్లలో, 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

  • ఇంజిన్​ - 124 సీసీ
  • పవర్​ - 8.30 పీఎస్​
  • టార్క్​ - 10.4 ఎన్​ఎం
  • మైలేజ్​ - 60 కి.మీ/లీటర్​
  • బ్రేక్స్​ - డిస్క్​
  • కెర్బ్​ వెయిట్ - 109 కేజీ

Honda Activa 125 Price : మార్కెట్లో ఈ హోండా యాక్టివా 125 స్కూటీ ధర సుమారుగా రూ.79,806 నుంచి రూ.88,979 (ఎక్స్​-షోరూం) వరకు ఉంటుంది.

5. TVS Jupiter Features : భారత్​లోని మోస్ట్ పాపులర్ స్కూటీల్లో టీవీఎస్ జూపిటర్ ఒకటి. ఇది 6 వేరియంట్లలో, 16 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

  • ఇంజిన్​ - 109.7 సీసీ
  • పవర్​ - 7.88 పీఎస్​
  • టార్క్​ - 8.8 ఎన్​ఎం
  • మైలేజ్​ - 50 కి.మీ/లీటర్​
  • బ్రేక్స్​ - డ్రమ్​​
  • కెర్బ్​ వెయిట్ - 109 కేజీ

TVS Jupiter Price : మార్కెట్లో టీవీఎస్ జూపిటర్​ స్కూటీ ధర సుమారుగా రూ.73,340 నుంచి రూ.89,748 (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

6. Honda Dio Features : చిన్న బడ్జెట్లో మంచి స్కూటీ కొనాలని అనుకునే వారికి హోండా డియో మంచి ఆప్షన్ అవుతుంది. ఇది 3 వేరియంట్లలో, 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

  • ఇంజిన్​ - 109.51 సీసీ
  • పవర్​ - 7.85 పీఎస్​
  • టార్క్​ - 9.03 ఎన్​ఎం
  • మైలేజ్​ - 50 కి.మీ/లీటర్​
  • బ్రేక్స్​ - డ్రమ్​​
  • కెర్బ్​ వెయిట్ - 103 కేజీ

Honda Dio Price : మార్కెట్లో హోండా డియో స్కూటీ ధర సుమారుగా రూ.70,211 నుంచి రూ.77,712 (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

7. Ola S1 X Features : మంచి ఎలక్ట్రిక్ స్కూటీ కొనాలని అనుకునేవారికి ఓలా ఎస్​1 ఎక్స్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది 7 అందమైన రంగుల్లో లభిస్తుంది.

  • రేంజ్​ - 190 కి.మీ/ఛార్జ్​
  • బ్యాటరీ కెపాసిటీ - 4 కిలోవాట్​
  • టాప్​ స్పీడ్​ - 90 కి.మీ/గంట
  • బ్యాటరీ వారెంటీ - 8 సంవత్సరాలు/ 80,000 కి.మీ
  • మోటార్ పవర్​ - 6 కిలోవాట్స్​
  • బ్రేక్స్​ - డబుల్ డిస్క్

Ola S1 X Price : మార్కెట్లో ఓలా ఎస్​1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటీ ధర సుమారుగా రూ.69,999 నుంచి రూ.99,999 (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

8. TVS Jupiter 125 Features : టీవీఎస్​ జూపిటర్​ 125 3 వేరియంట్లలో, 7 అందమైన రంగుల్లో లభిస్తుంది.

  • ఇంజిన్​ - 124.8 సీసీ
  • పవర్​ - 8.15 పీఎస్​
  • టార్క్​ - 10.5 ఎన్​ఎం
  • మైలేజ్​ - 57.27 కి.మీ/లీటర్​
  • బ్రేక్స్​ - డిస్క్​
  • కెర్బ్​ వెయిట్ - 108 కేజీ

TVS Jupiter 125 Price : మార్కెట్లో ఈ టీవీఎస్ జూపిటర్​ 125 ధర సుమారుగా రూ.86,405 నుంచి రూ.96,855 (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

9. Yamaha Fascino 125 Fi Hybrid Features : తక్కువ బడ్జెట్లో మంచి స్కూటీ కొనాలని అనుకునేవారికి యమహా ఫాసినో 125 ఎఫ్​ఐ హైబ్రిడ్​ బెటర్ ఆప్షన్ అవుతుంది.

  • ఇంజిన్​ - 125 సీసీ
  • పవర్​ - 8.2 పీఎస్​
  • టార్క్​ - 10.3 ఎన్​ఎం
  • మైలేజ్​ - 68.75 కి.మీ/లీటర్​
  • బ్రేక్స్​ - డిస్క్​
  • కెర్బ్​ వెయిట్ - 99 కేజీ

Yamaha Fascino 125 Fi Hybrid Price : మార్కెట్లో ఈ యమహా ఫాసినో 125 ఎఫ్​ఐ హైబ్రిడ్ స్కూటీ ధర సుమారుగా రూ.79,900 నుంచి రూ.93,430 (ఎక్స్​-షోరూం) వరకు ఉంటుంది.

10. Hero Pleasure Plus Features : హీరో కంపెనీ విడుదల చేసిన బెస్ట్ స్కూటీ ప్లెజర్​ ప్లస్. ఇది 6 వేరియంట్లలో, 9 అందమైన రంగుల్లో లభిస్తుంది.​

  • ఇంజిన్​ - 110.9 సీసీ
  • పవర్​ - 8.1 పీఎస్​
  • టార్క్​ - 8.70 ఎన్​ఎం
  • మైలేజ్​ - 50 కి.మీ/లీటర్​
  • బ్రేక్స్​ - డ్రమ్
  • కెర్బ్​ వెయిట్ - 106 కేజీ

Hero Pleasure Plus Price : మార్కెట్లో హీరో ప్లెజర్ ప్లస్​ స్కూటీ ధర సుమారుగా రూ.70,838 నుంచి రూ.82,738 (ఎక్స్​-షోరూం) ఉంది.

మంచి మైలేజ్ ఇచ్చే కారు కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Most Fuel Efficient Cars In India

ఫస్ట్-పార్టీ ఇన్సూరెన్స్ Vs థర్డ్​-పార్టీ కార్​ ఇన్సూరెన్స్​ - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్​! - Car Insurance

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.