ETV Bharat / entertainment

'వారందరూ అలాంటోళ్లు' - టాలీవుడ్ స్టార్ హీరోలపై కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్​! - Kajal Agarwal

author img

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 10:17 PM IST

Kajal Agarwal about Tollywood Heroes : టాలీవుడ్ టాప్ హీరోలపై తనకున్న అభిప్రాయాన్ని తెలిపింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ప్రభాస్, రామ్ ​చరణ్​, మహేశ్ బాబు, ఎన్టీఆర్​, అల్లు అర్జున్, చిరంజీవి, బాలకృష్ణల గురించి మాట్లాడింది. ఇంతకీ ఏం చెప్పిందంటే?

Source ETV Bharat
Kajal Agarwal (Source ETV Bharat)

Kajal Agarwal about Tollywood Heroes : టాలీవుడ్ చందమామ కాజల్​​​​ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్, రామ్ ​చరణ్​, మహేశ్ బాబు, ఎన్టీఆర్​, అల్లు అర్జున్, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలందరితో నటించి బడా హీరోయిన్​గా ఎదిగింది. పెళ్లి, ప్రెగ్నెంట్ సమయంలో కాస్త జోరు తగ్గించినా మళ్లీ ఫామ్​లోకి వచ్చేసింది. వరుస సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తోంది.

ఈ క్రమంలోనే ఇప్పుడు సత్యభామ చిత్రంతో పోలీస్‌ ఆఫీసర్​గా ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. సుమన్‌ చిక్కాల ఈ చిత్రానికి దర్శకుడు. మే 31న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న కాజల్​ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఇష్టాయిష్టాలను చెప్పింది. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోలందరి గురించి తన అభిప్రాయం తెలిపింది. ఇప్పటివరకు తాను నటించిన చిత్రాల్లో సత్యభామ అంటే ఇష్టమని చెప్పింది కాజల్. నటీనటులు ఎవరైనా సరే ప్రస్తుతం తాము చేస్తోన్న చిత్రాన్ని అమితంగా ఇష్టపడాలని, అందుకే తనకు సత్యభామ అంటే ఇష్టమని పేర్కొంది.

ఇంకా మాట్లాడుతూ "కామెడీ, రొమాన్స్‌ జానర్ సినిమాలను ఇష్టపడతాను. బాద్‌ షాలో నా పాత్ర అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు చేసిన సినిమాలోని అన్నీ పాత్రల పేర్లు గుర్తే. ఇకపోతే చీర కట్టుకోవడాన్ని ఇష్టపడతాను. మామిడి పండ్లంటే ఇష్టం. ఇప్పుడు సీజన్‌ కదా. ప్రతిరోజూ తింటున్నాను. ఒక్కోరోజు మూడు పండ్లు కూడా తినేస్తున్నాను." అని చెప్పింది.

"అలాగే సోషల్ మీడియాను చాలా తక్కువ వాడతాను. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటేనే పోస్ట్‌ చేస్తాను. ఇక లాంగ్ డ్రైవ్స్​ అంటే అంతగా ఇష్టపడను. నాకు ప్రయాణం చేయడం అంటే ఎక్కువగా నచ్చదు. దానికోసం టైమ్ వేస్ట్ చేయను. అందుకే విమానంలోనే ప్రయాణించడానికే ఎక్కువగా ప్రాధాన్యమిస్తాను" అని చెప్పుకొచ్చింది.

టాలీవుడ్ హీరోల విషయానికొస్తే - "నాకు అందరూ ఇష్టమే. వాళ్లలో ఒక్కరు అని చెప్పలేను. ప్రభాస్‌- సినిమాలను సెలెక్ట్​ చేసుకునే విధానం చాలా బాగుంటుంది. పాన్‌ ఇండియా, గ్లోబల్‌ స్క్రిప్ట్‌లను సెలెక్ట్ చేసుకుంటాడు. మన సినిమాలకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చాడు. ఎన్టీఆర్‌ చాలా టాలెంటెడ్‌ యాక్టర్. రామ్‌ చరణ్‌ ఆల్‌ రౌండర్‌. సినిమా సినిమాకు ఎదుగుతున్నాడు. మహేశ్‌బాబు చార్మింగ్‌ పర్సన్‌. అల్లు అర్జున్‌ ప్రతి సన్నివేశంలో అద్భుతంగా నటిస్తాడు. పుష్ప2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. పవన్‌ కల్యాణ్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. చిరంజీవి ఓ కంప్లీట్‌ ప్యాకేజ్‌. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తాను. బాలకృష్ణ చాలా ఫన్నీగా ఉంటారు" అంటూ తన అభిప్రాయాల్ని తెలిపింది.

నాలుగున్నార నెలల్లోనే రూ.1000 కోట్లు - మరి టాలీవుడ్, బాలీవుడ్​ పరిస్థితేంటి? - Malayalam Movies Boxoffice

ఈ వారమే రూ.1400 కోట్ల భారీ యాక్షన్​ మూవీ - OTTలోకి రానున్న 11 సినిమా/సిరీస్​లివే! - This Week Theatre OTT Releases

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.