పెన్షన్​ డబ్బుల చిల్లర పైసలకు బదులు పింఛన్​దారులకు సబ్బులు - Soaps instead of full Pension

By ETV Bharat Telangana Team

Published : May 9, 2024, 9:19 PM IST

thumbnail
పెన్షన్​ డబ్బుల చిల్లర పైసలకు బదులు పింఛన్​దారులకు సబ్బులు (ETV Bharat)

Distribution of soaps to pensioners instead of money : వృద్ధులకు 2016 రూపాయలు, వికలాంగులకు రూ.4016 ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులకు పోస్టు ఆఫీసు అధికారులు రూ.16 చిల్లర లేవని దానికి బదులు సబ్బులు ఇస్తున్నారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో పెంబి మండలంలోని మందపల్లిలో జరిగింది. చుట్టుపక్కల గ్రామాల పెన్షన్​దారులకు సరైన రవాణా లేకపోయినా కాలినడకన పెన్షన్ కోసం పోస్టు ఆఫీస్​కు వెళ్లారు. పూర్తి మొత్తంలో పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా 16 రూపాయల చిల్లర లేదని సబ్బులు ఇస్తున్నారని పెన్షన్​దారులు ఆందోళన వ్యక్తం చేశారు. 

Pensioners Demand for Full Pension Amount : వృద్ధులు, వికలాంగులు కావడంతో ఏమీ చేయలేక సబ్బులు తీసుకోవాల్సి వస్తుందని పలువురు పెన్షన్​దారులు ఆవేదన వ్యక్తం చేశారు. వాటికి బదులు అందరికీ డబ్బులు ఇవ్వాలని మొరపెట్టుకున్నా పెన్షన్ చిల్లర రూపాయలకు సబ్బులు ఇస్తున్నారని వాపోయారు. ​సబ్బులు తమకు వద్దని రావాల్సిన పెన్షన్​ను పూర్తిగా నగదు రూపంలో ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.