ETV Bharat / state

పెరుగుతున్న ధాన్యం కొనుగోళ్లు.. నిల్వలు ఏం చేయాలి..?

author img

By

Published : Nov 4, 2022, 9:40 PM IST

How to store grain
ధాన్యం నిల్వలు ఎలా

How to store grain reserves in Mahabubnagar: గత వానాకాలం, యాసంగి సీజన్ లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇప్పటికీ మిలర్లు మరాడించి ప్రభుత్వానికి అప్పగించలేదు. లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లోనే మూలుగుతోంది. ఈ వానాకాలంలో ధాన్యం కొనుగోళ్లకు సమయం ముంచుకొస్తోంది. ఈ ఏడాది వానలు విస్తారంగా కురవడంతో వరి విస్తీర్ణం పెరిగి.. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పోటెత్తే అవకాశం ఉంది. వాటిని ఎక్కడ నిల్వచేయాలన్నది ప్రస్తుతం మిల్లర్లకు, అధికారులకు సవాలుగా మారనుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పూర్తికాని సీఎంఆర్​, తాజా ధాన్యం కొనుగోళ్లకు ప్రతిబంధకంగా మారుతున్న తీరుపై కథనం.

ధాన్యం నిల్వలు ఎలా

How to store grain reserves in Mahabubnagar: ఈ ఏడాది వానాకాలంలో వర్షాలు దంచికొట్టాయి. ఫలితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు 8లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. కొన్నిచోట్ల వరికోతలు సైతం ప్రారంభమయ్యాయి. కొన్ని రోజుల్లో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తుతుంది. గత వానాకాలం, యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం ఇంకా మిల్లుల్లోనే మూలుగుతోంది. గత యాసంగికి సంబంధించి 3లక్షల65వేల లక్షల మెట్రిక్ టన్నుల మరాడించిన బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థకు అప్పగించాల్సి ఉండగా.. కేవలం 5శాతమే అందించారు. 2021 వానాకాలంలోసైతం 50శాతం మరాడించిన బియ్యాన్నే అప్పగించారు.

దీంతో తాజాగా సేకరించే ధాన్యాన్ని ఎక్కడ దాచిపెడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్లు చేస్తేనే .. వానాకాలం ధాన్యం కొనుగోలు సజావుగా సాగే అవకాశం ఉంది. లేదంటే తిప్పలు తప్పవు. మరాడించిన బియ్యం అప్పగించేందుకు ఈ నెలాఖరు వరకూ అవకాశం ఉన్నా.. నెల రోజుల్లో సుమారు 4లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మరాడించడం సాధ్యమయ్యే పనికాదు. ఈసారి సొంత అవసరాలు, ప్రైవేటు మార్కెట్ కు 40శాతం ధాన్యం వెళ్లినా, మిగిలిన 60శాతం ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే రానుంది. అయితే ఈ ధాన్యం ఎక్కడ నిల్వ చేయాలన్నది మిల్లర్లకు సవాలుగా మారనుంది. సన్నరకం ఎక్కువగా వస్తోంది కావున దీనికి మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉందని వెంకటేశ్​ జిల్లా వ్యవసాయశాఖ అధికారి తెలిపారు.

వానాకాలంలో నాణ్యమైన ధాన్యాన్ని బియ్యంగా మార్చి అమ్ముకుని, యాసంగిలో నాణ్యత లేని బియ్యాన్ని.. లేదంటే పీడీఎస్​ బియ్యాన్ని తిరిగి సీఎంఆర్​ కింద అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు మాత్రం నిల్వకు ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని అంటున్నారు. 2.50లక్షల టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. 1.50లక్షల టన్నుల ధాన్యం మిల్లర్ల దగ్గర ఉంది. మిగిలిన ధాన్యాన్ని వేరే జిల్లాకు పంపించాలా లేక వేరే గూడాం తీసుకొని దానిలో నిల్వ చేయాలా అనేది ఆలోచిస్తున్నామని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్​ జగదీశ్​ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.