ETV Bharat / state

ప్రపంచ శాంతి దూతలా.. నన్ను ఇమిటేట్ చేస్తుండు: కేఏ పాల్

author img

By

Published : Nov 4, 2022, 8:19 PM IST

మునుగోడు ఎన్నికలో కేఏ పాల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఓవైపు నవ్వులు పూయిస్తునే... మునుగోడు బైపోల్‌లో ఉత్సాహంగా పాల్గొన్నాడు. తాజాగా నల్గొండలో ప్రెస్‌మీట్ పెట్టిన కేఏ పాల్.. కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.

KA PAUL FIRES ON CM KCR
KA PAUL FIRES ON CM KCR

ఆయనేదో ప్రపంచ శాంతి దూతలా.. నన్ను ఇమిటేట్ చేస్తుండు: కేఏ పాల్

మునుగోడు ఉప ఎన్నికల్లో 50 వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నట్లు ప్రజశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధీమా వ్యక్తంచేశారు. నల్గొండలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన పాల్‌ లక్షా పది వేల ఓట్లు ఉంగరం గుర్తుకు వేసినట్లు అంచనా వేశారు. మునుగోడులో గెలిస్తే తానే కాబోయే సీఎం అవనున్నట్లు జోస్యం చెప్పారు. ఉప ఎన్నికల ప్రచార సమయంలో మూడుసార్లు తనపై దాడికి యత్నించారని తెలిపారు. పోలీసులను అడ్డం పెట్టుకుని సీఎం కేసీఆర్‌ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు.

''ఆయనేదో మహాత్మాగాంధీలా, డాక్టర్ అబ్దుల్ కలాంలా, కేఏ పాల్‌లా... నన్ను ఇమిటేట్ చేస్తున్నారు. అసలు కేసీఆర్ ఎవరు.. ఆయనకు మాట్లాడే హక్కు ఉందా.. కానీ ఆయన మాట్లాడిన మాటలు మీరు విన్నారా.. ముందు ఆయన తెలంగాణ ద్రోహి. 4 లక్షల 60వేల కోట్లు మిగిలినవి.. ఆ డబ్బు ఏమయ్యాయి. ఆయనకు గంట రెండు గంటల కవరేజ్ ఎందుకు ఇస్తున్నారు. నా వీడియోలు కేటీఆర్ ఆన్ ఎయిర్ పోకుండా చేస్తున్నారు. అందుకే నిన్న కూసుకుంట్ల ప్రభాకర్‌ను చిత్తు చిత్తుగా ఓడించాం. అందుకే నిన్న ఆయన స్పీచ్‌లో క్లారిటీ వచ్చేసింది. ఓటములు, గెలుపులు సహజమని నాలుగు సార్లు అన్నారు. ఓడిపోతున్నాడనే అలా చెప్పారు''. - కేఏ పాల్, ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు

ఇవీ చూడండి:

KA Paul In Farmer Getup: రైతు వేషంలో కేఏ పాల్‌.. వీడియో చూశారా?

మునుగోడు ప్రచారంలో.. డ్యాన్స్​లతో హోరెత్తించిన కేఏ పాల్

పోలింగ్ కేంద్రాల వద్ద కేఏ పాల్ పరుగో పరుగు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.