ETV Bharat / state

తాగిన మైకంలో భర్తను చంపిన భార్య

author img

By

Published : Jul 8, 2020, 11:57 AM IST

తాగిన మైకంలో భార్య తన భర్తను అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో పడుకున్న భర్తను కొడవలితో గొంతు కోసి చంపేసింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. దీంతో ఆ పిల్లలకు తండ్రి లేకుండా పోయాడంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

తాగిన మైకంలో భర్తను చంపిన భార్య
తాగిన మైకంలో భర్తను చంపిన భార్య


కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం రోళ్లపాడులో శ్రీనివాస్‌‍‌‍‌(42), స్వప్న(35) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు కూలిపని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే భార్యాభర్తలిద్దరికీ మద్యం సేవించే అలవాటు ఉంది. గతకొంత కాలంగా వీరి మధ్య కలహాలు చెలరేగుతున్నాయి.

భర్త శ్రీనివాస్ వాళ్ల నాన్న పెన్షన్ డబ్బుల కోసం స్వప్న రోజు గొడవ పడేది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన గొడవ కాస్తా పెద్దదైంది. తీవ్ర ఆగ్రహానికి గురైన స్వప్న.. భర్త శ్రీనివాస్‌ను కొడవలితో గొంతు కోసి హత్య చేసింది. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు తిరుపతి (7), కుమార్తె సువర్ణ (5) ఉన్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులను విచారించారు. మద్యం మత్తులోనే స్వప్న ఈ హత్యకు పాల్పడి ఉంటుందని తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు పిల్లలు మాత్రం ఇంట్లో ఏం జరిగినదో విషయం కూడా తెలియకుండా బిక్కుబిక్కుమంటూ చూస్తూ నిలబడిపోయారు. తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవ కారణంగా ప్రపంచం తెలియని పిల్లలకు తండ్రి లేకుండా పోయాడంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:ప్రైవేట్​లో వైద్యానికి నో చెప్పొద్దు.. ఫీజులెక్కువ అడగొద్దు: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.