ETV Bharat / state

ఎమ్మెల్యే కోనప్ప దంపతులకు 14రోజుల గృహ నిర్బంధం

author img

By

Published : Mar 20, 2020, 8:22 PM IST

ఇటీవలే అమెరికా పర్యటన ముగించుకున్న సిర్పూర్ శాసన సభ్యుడు కోనేరు కోనప్ప మార్చి 15న భారత్ తిరిగొచ్చారు. ఈ క్రమంలో 14 రోజుల పాటు ఎమ్మెల్యే దంపతులు క్వారంటైన్​లో ఉండాలని డీఎంహెచ్​ఓ ఆదేశాలు జారీ చేశారు.

14 రోజులు క్వారంటైన్​గా ఎమ్మెల్యే కోనప్ప దంపతులు
14 రోజులు క్వారంటైన్​గా ఎమ్మెల్యే కోనప్ప దంపతులు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన భార్య రమాదేవితో కలిసి ఇటీవల అమెరికా పర్యటన ముగించుకున్నారు. ఈ మేరకు మార్చి 15న స్వదేశానికి తరలివచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో అనుమానితులు, విదేశాల నుంచి వచ్చే వారికి సంబంధించి ప్రత్యేక అదేశాలు జారీ చేశాయి.

ఇతర దేశాల నుంచి భారత్​కు వచ్చిన వారిని 14 రోజుల పాటు స్వీయ గృహ నిర్భందంలో ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి ఎమ్మెల్యే కోనప్పకు ప్రభుత్వం తరఫున ఆదేశాలను జారీ చేశారు. రెండు వారాల పాటు ఇంటిని విడిచి బయటకు వెళ్లరాదని... జనానికి దూరంగా ఉండాలని సూచించారు.

14 రోజులు క్వారంటైన్​గా ఎమ్మెల్యే కోనప్ప దంపతులు
14 రోజులు క్వారంటైన్​గా ఎమ్మెల్యే కోనప్ప దంపతులు

ఇవీ చూడండి : 'మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటున్నారు'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.