ETV Bharat / state

CM KCR Election Campaign Today : ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్​ఎస్.. నేడు మహబూబాబాద్‌, వర్దన్నపేట, పాలేరులో కేసీఆర్ సభలు

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2023, 7:46 AM IST

Telangana Elections 2023
CM KCR Praja Ashirvada Sabha in Paleru

CM KCR Election Campaign Today : ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో భారత్ రాష్ట్రసమితి ప్రచార జోరు మరింత పెంచుతోంది. ఇప్పటికే ప్రచారపర్వంలో ముందున్న బీఆర్​ఎస్​ అభ్యర్థులు, పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్తేజం నింపడమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​ రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మహబూబాబాద్‌, వర్దన్నపేట, పాలేరు సభలకు హాజరవనున్నారు.

CM KCR Khammam Tour ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్​ఎస్.. నేడు మహబూబాబాద్‌ వర్దన్నపేట పాలేరులో కేసీఆర్ సభల

CM KCR Election Campaign Today : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవాళ నిర్వహించనున్న ఎన్నికల ప్రచార బహిరంగ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గులాబీ శ్రేణులు దిగ్విజయం చేయాలన్న సంకల్పంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు గులాబీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కూసుమంచి మండలం జీళ్లచెర్వులో 25 ఎకరాల్లో బహిరంగ సభ(KCR Meeting)కు భారీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఈ సభకు సుమారు 80 వేల మంది జనం వస్తారని బీఆర్​ఎస్​ నాయకులు భావిస్తున్నారు. సీఎం కేసీఆర్​ సెంటిమెంట్ ప్రకారం తూర్పు దిక్కుగా భారీ సభా వేదికను సిద్ధం చేస్తున్నారు.

CM KCR Public Meeting in Paleru Today : పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం గ్రామీణం, తిరుమలాయపాలెం మండలాల నుంచి భారీగా కార్యకర్తలు రానున్నారని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధిపైనా ప్రజలకు స్పష్టమైన హామీలు ఇచ్చే అవకాశం ఉందని.. మేనిఫెస్టో(BRS Manifesto)ను ప్రజలోకి తీసుకువెళ్లనున్నారు.

KCR Medchal Jadcherla Tour Today : ప్రచారంలో కారు జోరు.. నేడు జడ్చర్ల, మేడ్చల్​లో కేసీఆర్​ సభలు

"దాదాపు 80 వేల మంది ప్రజలు కేసీఆర్​ సభకు వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సభ విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను." - కందాల ఉపేందర్ రెడ్డి, పాలేరు బీఆర్​ఎస్​ అభ్యర్థి

CM KCR Public Meeting in Khammam : పాలేరు సభ అనంతరం మహబూబాబాద్‌లో నిర్వహించే ప్రజా ఆశీర్వద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్​ హాజరుకానున్నారు. సీఎం బహిరంగ సభ కోసం మానుకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పట్టణ కూడళ్లు గులాబీమయంగా మారాయి. హెలీప్యాడ్, సభా ప్రాంగణంలో ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌(MLA Shankar Naik) పరిశీలించారు. మూడోసారి బీఆర్​ఎస్ అధికారంలోకి రావటం ఖాయమని మంత్రి సత్యవతి స్పష్టం చేశారు.

"బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్ధులను ప్రకటించి చేసి రెండు నెలలు అవుతోంది. ప్రచారంలో ముందుకు వెళుతున్నాం. మేము అభివృద్ధి ఎక్కువగా చేశాం. అందుకే చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. మూడోసారి ముచ్చటగా అధికారంలోకి రావడం ఖాయం. కేసీఆర్​ బహిరంగ సభను మహబూబాబాద్ ప్రజలు ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను." - సత్యవతి రాఠోడ్‌, గిరిజన సంక్షేమ మంత్రి

CM KCR Public Meeting at Wardhannapet : మహబూబాబాద్​లో బహిరంగ సభ అయిన అనంతరం వర్దన్నపేట సభకు కేసీఆర్​ హాజరవుతారు. సభ ఏర్పాట్లను ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పరిశీలించారు. భారీగా వచ్చే జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

CM KCR Siddipet Sircilla Tour Today : ప్రచారంలో కేసీఆర్ దూకుడు.. నేడు KTR, హరీశ్ రావు ఇలాకాలో సభలు

నేడు వనపర్తి, మహబూబ్​నగర్​లో కేసీఆర్ సభలు

CM KCR Election Tour : సీఎం కేసీఅర్ ఎన్నికల సభల షెడ్యూల్ ఖరారు.. ఈనెల 15 నుంచి నవంబర్ 9 వరకు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.