ETV Bharat / state

వ్యాక్సిన్​ పంపిణీపై కలెక్టర్లతో ఫోన్​లో చర్చించిన మంత్రి

author img

By

Published : Apr 9, 2021, 11:03 PM IST

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్​, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రుల్లో వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు అన్ని సౌకర్యాలను కల్పించాలని అధికారులను మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. కొవిడ్ వ్యాప్తిని నిరోధించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. వైరస్ వ్యాప్తి, టీకా పంపిణీ మొదలైన అంశాలపై అధికారులతో ఫోన్​లో చర్చించారు.

Minister Prashant Reddy Review on Vaccination
వ్యాక్సినేషన్​ మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష

రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్నందువల్ల అధికారులు వైరస్ వ్యాప్తిని నియంత్రించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు. కొవిడ్ రెండో దశ వ్యాప్తి , టీకా పంపిణీపై నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో ఫోన్​లో మాట్లాడారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్​, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రుల్లో వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు అన్ని సౌకర్యాలను కల్పించాలని కలెక్టర్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. ఏ పేషంట్​కు ఎక్కడ చికిత్స అందించాలో ఒక ప్రోటోకాల్​ను రూపొందించాలని సూచించారు. ప్రజలు కూడా విధిగా మాస్క్ ​ధరించాలని కోరారు.

ఇదీ చదవండి: సాగర్‌ ఉపఎన్నికలో కోవర్టులపైనే పార్టీల ప్రత్యేక దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.