ETV Bharat / state

సందేశాన్నిస్తూ.. విభిన్న ఆకృతుల్లో ఆకర్షిస్తున్న గణనాథుడు

author img

By

Published : Aug 25, 2020, 1:07 PM IST

special ganesh idols at korutla
సందేశాన్నిస్తూ.. విభిన్న ఆకృతుల్లో ఆకర్షిస్తున్న గణనాథుడు

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో వినాయకుడిని విభిన్న రీతిలో తయారు చేశారు. కేవలం విగ్రహాలనే కాకుండా మండపాలనూ అద్భుతంగా అలంకరించారు. కానీ కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాది విగ్రహాల సంఖ్య తగ్గిందని స్థానికులు తెలిపారు.

ఈ సంవత్సరం కరోనా వ్యాప్తి కారణంగా.. వైరస్​ కట్టడి కోసం ప్రభుత్వం మూడు అడుగుల కంటే పెద్ద విగ్రహాన్ని పెట్టకూడదని నిబంధనలు విధించారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా కోరుట్లలో కొంతమంది యూత్​ సభ్యులు నిబంధనలకు కట్టుబడి కొన్ని వినూత్న విగ్రహాలను రూపొందించి.. వాటికి పూజలు చేస్తున్నారు.

పట్టణంలోని గ్రీన్ హోప్​ యూత్​ వారు తయారుచేసిన నెమలి పింఛాలతో తయారుచేసిన గణనాథుడిని ప్రతిష్ఠించారు. వినోభా ఫ్రెండ్స్​ యూత్​ వారు.. కరోనా నుంచి జాగ్రత్తలు తెలిపేలా.. మాస్క్​ ధరించిన బాల గణేశుడిని నిలిపి పూజలు చేశారు. సిరిపురం సాయి తేజ అనే యువకుడు.. తన ఇంట్లో చెడిపోయిన కంప్యూటర్ సర్క్యూట్, విడి భాగాలతో, విద్యుత్ పరికరాలతో తయారు చేసిన వినాయకుడు ఎంతగానో ఆకర్షిస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.