ETV Bharat / state

YS Sharmila Tweet On BRS And BJP : 'గల్లీలో సిగపట్లు.. దిల్లీలో కౌగిలింతలు.. ఇది బీజేపీ, బీఆర్​ఎస్​ మైత్రి'

author img

By

Published : Jun 24, 2023, 3:39 PM IST

YS Sharmila Tweet On BRS : గల్లీలో సిగపట్లు, దిల్లీలో కౌగిలింతలు ఇది బీజేపీ, బీఆర్​ఎస్​ తీరు.. దీన్ని నిజం కాదని నిరూపించగలరా అని వైఎస్​ షర్మిల ట్విటర్​ వేదికగా ప్రశ్నించారు. బీహార్​లో జరిగిన బీజేపీయేతర పక్షాల సమావేశానికి బీఆర్​ఎస్​కు ఎందుకు ఆహ్వానం అందలేదో చెప్పే దమ్ము.. బీఆర్​ఎస్​ నాయకులకు ఉందా అని వైఎస్​ షర్మిల సవాల్​ విసిరారు. బీజేపీ నేతలకు దక్కని అమిత్​ షా అపాయింట్​మెంట్​ కేటీఆర్​కు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

YS Sharmila
YS Sharmila

YS Sharmila Fire On Twitter : కుళ్లు కాయలను బంగారు సంచిలో దాచినా కంపు బయటపడదా.. అలాగే ఉంది బీఆర్​ఎస్​, బీజేపీ అక్రమ మైత్రి అని ట్విటర్​ వేదికగా వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ఆరోపించారు. ఎంతదాచినా దాగదులే అన్నట్లు ఉంది వీరి స్నేహం అని విమర్శలు చేశారు. గల్లీలో సిగపట్లు, దిల్లీలో కౌగిలింతలు ఇది బీజేపీ, బీఆర్​ఎస్​ తీరు. దీన్ని నిజం కాదని నిరూపించగలరా అని వైఎస్​ షర్మిల ప్రశ్నించారు.

బిహార్​లో జరిగిన బీజేపీయేతర పక్షాల సమావేశానికి బీఆర్​ఎస్​కు ఎందుకు ఆహ్వానం అందలేదో చెప్పే దమ్ము.. బీఆర్​ఎస్​ నాయకులకు ఉందా అని వైఎస్​ షర్మిల సవాల్​ విసిరారు. విపక్షాల కూటమికి అధ్యక్షత వహిస్తున్న బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​నే స్వయంగా బీజేపీపై కేసీఆర్​ తీరు సరిగ్గా లేదని చెప్పేశారని ఆమె వెల్లడించారు. మరోవైపు శరద్​ పవార్​ అయితే ఏకంగా బీజేపీ, బీఆర్​ఎస్​ ఒకే గూటి పక్షులని స్పష్టం చేశారని వివరించారు. వీరు ఇలా చెప్పిన తర్వాత కూడా ఇంకా మీ నాటకాలు దేనికి సంకేతమని ప్రశ్నించారు.

YS Sharmila Tweet On KCR : తమిళనాడు మాజీ మంత్రిని ఎంత రాక్షసంగా సీబీఐ అరెస్టు చేసిందో అందరూ చూశామని వైఎస్​ షర్మిల తెలిపారు. మరి బలమైన సాక్షాలున్నాయంటూ కేసీఆర్​ ముద్దు బిడ్డ కవితను దిల్లీ లిక్కర్​ స్కాంలో ప్రధాన నిందితురాలు అని చెప్పి నాలుగుసార్లు ఆఫీసుల చుట్టూ తిప్పుకున్న సీబీఐ.. ఆ తర్వాత ఆమెను ఎందుకు అరెస్టు చేయలేదని ఘాటుగా ప్రశ్నించారు. అసలు చెప్పాలంటే తుది జాబితాలో ఆమె పేరే ఉండకపోవడమేంటో అర్థం కాలేదన్నారు. కవిత కడిగిన ముత్యమా లేకపోతే.. మీది కుదిరిన బంధమా అని ధ్వజమెత్తారు.

  • కుళ్లు కాయలను బంగారు సంచిలో దాచినా కంపు బయటపడదా ఏంటి.. అలాగే ఉంది.. భారాస, భాజపాల అక్రమ మైత్రి. ఎంతదాచినా దాగదులే అన్నట్టు... గల్లీలో సిగపట్లు, ఢిల్లీలో కౌగిలింతలు.. నిజం కాదని నిరూపించగలరా? బీహార్ లో జరిగిన బీజేపీయేతర పక్షాల సమావేశానికి మీకు ఆహ్వానం ఎందుకు అందలేదో చెప్పే…

    — YS Sharmila (@realyssharmila) June 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలంగాణ మంత్రుల మీద ఈడీ దాడులుంటాయి.. కానీ వారి అరెస్టులు ఉండవని వైఎస్​ షర్మిల ట్విటర్​లో ట్వీట్​ చేశారు. కాళేశ్వరం మీద తాను నిరంతరం పోరాటం చేస్తున్నా.. బీజేపీ మంత్రులు పనికి మాలిన ప్రకటనలు చేస్తారు తప్ప అందుకు తగిన చర్యలుండవని విమర్శించారు. ఇంతలోనే కేసీఆర్​ బీజేపీని పెద్దమనసుతో క్షమించేసి.. సభాముఖంగా దాడులు చేయడం బంద్​ చేయడం​ చేస్తారని ఎద్దేవా చేశారు.

BRS And BJP Alliance In Telangana Election : మంత్రి కేటీఆర్​కు ఆగమేఘాల మీద దిల్లీకి పోయినా.. కేంద్రమంత్రి అమిత్​ షాను కలుస్తారని వైఎస్​ షర్మిల అన్నారు. కానీ బీజేపీ ముఖ్యమంత్రులు నెలలు తరబడి.. ఆయన అపాయింట్​మెంట్​ కోసం ఎదురుచూస్తున్నా దొరకదని వ్యాఖ్యానించారు. వారికి దొరకని అపాయింట్​మెంట్​ గాలి కన్నా వేగంగా కేటీఆర్​కు దొరుకుతుందన్నారు. సమాజ్దార్​ కో ఇషారా కాఫీ అన్నట్లు.. మనస్సాక్షిని అమ్ముకుని చేతులు కలుపుతున్న వీరి నీచ క్రీడలను నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు గమనించారని.. వీరి స్నేహానికి బొందపెట్టారని వైఎస్​ షర్మిల ట్వీట్​ ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.