ETV Bharat / state

వాళ్లందరికి నోటీసులు ఇచ్చిన టీపీసీసీ

author img

By

Published : Nov 20, 2022, 7:38 PM IST

Tpcc Issue Notice To Spokes Persons
Tpcc Issue Notice To Spokes Persons

Tpcc Issue Notice To Spokes Persons: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశాలకు గైర్హాజరవుతున్న అధికార ప్రతినిధులపై టీపీసీసీ చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే ఆయా అధికార ప్రతినిధులకు నోటీసులు జారీ చేసింది.

Tpcc Issue Notice To Spokes Persons: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న సమావేశాలకు డుమ్మా కొడుతున్న అధికార ప్రతినిధులను పీసీసీ వివరణ కోరింది. కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి కారణాలు ఏమిటని ప్రశ్నిస్తూ.. ఇవాళ నోటీసులు ఇచ్చింది. పీసీసీ ఆర్గనైజింగ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్​ కుమార్‌ గౌడ్‌ ఈ మేరకు ఆయా అధికార ప్రతినిధులకు వాట్సప్‌ ద్వారా నోటీసులు ఇచ్చారు. పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు హాజరు కాని అధికార ప్రతినిధులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియచేయాలని స్పష్టం చేశారు. పీసీసీ నిర్వహిస్తున్న సమావేశాలను తేలికగా తీసుకోవడం వల్ల అటు నాయకులు కాని.. ఇటు పీసీసీ కార్యవర్గ సభ్యులు కాని, అధికార ప్రతినిధులు కాని గైర్హాజరవుతున్నారని తెలిపారు. దీంతో ఈరోజు అధికార ప్రతినిధులకు నోటీసు ఇచ్చి వివరణ కోరారు.

జగ్గారెడ్డి ఎఫెక్టేనా..?: నిన్న నిర్వహించిన ఓ సమావేశంలో ప్రజలు విపక్ష హోదా ఇచ్చిన దృష్ట్యా ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పోరాటాలు చేయాలి.. ప్రజలకు వద్దకు పార్టీ వెళ్లాలని జగ్గారెడ్డి సూచించారు. వారానికోసారి పీసీసీ సమావేశం అన్నారు.. కానీ ఆ ఊసే లేదని తప్పుపట్టారు. పీసీసీలో నేతలను సమన్వయం చేయాల్సిన మహేశ్​ కుమార్ గౌడ్ విఫలమయ్యారని మండిపడ్డారు. జూం సమావేశానికి మహేశ్​ కుమార్ గౌడ్ తనను ఆహ్వానిస్తే ఆగ్రహం వ్యక్తం చేశానని, కరోనా తగ్గిపోయినా ఇంకా జూం మీటింగ్ ఏంటి..? అని సూటిగా ప్రశ్నించారు.

ఏమైనా పార్టీకి నష్టం జరిగితే ఆయనదే పూర్తి బాధ్యత అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తప్పు కూడా ఉందని.. అతనిదీ 100 శాతం తప్పేనని తప్పుపట్టారు. ఇంట్లో కూర్చుని జూం మీటింగ్ వృథా.. కూర్చుని గంటల తరబడి చర్చించే ఎన్నో అంశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆయా అంశాలపై క్షుణ్ణంగా ఏఐసీసీ, అధిష్ఠానానికి లేఖ రాస్తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి: 'వారానికోసారి పీసీసీ భేటీ పెట్టాలి.. లేకుంటే పార్టీకి తీవ్ర నష్టం'

'2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం'

ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికి రూ.2.11 కోట్ల విలువైన కారు గిఫ్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.