ETV Bharat / state

రాష్ట్రంలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర ములుగు జిల్లా నుంచే ప్రారంభం కానుంది..

author img

By

Published : Feb 3, 2023, 3:49 PM IST

Hath Se Hath Jodo Yatra in TS: హాథ్ సే హాథ్ జోడో యాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు జిల్లా నుంచి ప్రారంభించేందుకు సర్వం సిద్దమైయింది. అదేవిధంగా రేపటి సమావేశంలో నాయకుల పర్యటనలకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు  తెలుస్తోంది.

Everything is ready for Hath Se Hath Jodo Yatra tour
హాథ్ సే హాథ్ జోడో యాత్ర పర్యటనకు సర్వం సిద్దం

హాథ్ సే హాథ్ జోడో యాత్ర పర్యటనకు సర్వం సిద్దం

Hath Se Hath Jodo Yatra in TS: ఏఐసీసీ పిలుపుతో దేశ వ్యాప్తంగా జరుగుతున్న హాథ్‌ సే హాథ్ జోడో యాత్రను ఆరో తేదీ నుంచి ప్రారంభమవుతోంది. యాత్రలో నాయకులు, కార్యకర్తలందరూ పాల్గొనాలని ఏఐసీసీ కోరింది. ఇటీవల జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో 119 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను 50 నియోజక వర్గాల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పర్యటిస్తారని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే తెలిపారు.

చర్చల తరవాత రూట్ మ్యాప్​పై స్పష్టత: మిగిలిన నియోజకవర్గాల్లో ఎవరెవరు పర్యటిస్తారో వివరాలు ఇవ్వాలని నాయకులను కోరారు. మాణిక్‌రావ్‌ ఠాక్రే సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చి 6వ తేదీ వరకు ఇక్కడే ఉంటూ గాంధీభవన్‌ వేదికగా పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. సమావేశంలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర విజయవంతం చేసేందుకు పార్టీపరంగా తీసుకుంటున్నచర్యలపై చర్చించనున్నారు. అనంతరం రూట్‌ మ్యాప్‌లపై స్పష్టత ఇవ్వనున్నట్ల సమాచారం.

హాథ్ సే హాథ్ జోడో యాత్రకు సర్వం సిద్దం: రేవంత్‌ రెడ్డి 50నియోజక వర్గాలల్లో పర్యటించేందుకు సర్వం సిద్దమైంది. అన్ని రకాల సౌకర్యాలు ఉండేట్లు 4కార్వాన్‌ వాహనాలను సిద్దం చేసుకున్నారు. నాయకుల ప్రసంగాలకు ఏలాంటి స్టేజిలు ఉండనందున అందుకోసం ఓ ప్రత్యేక వాహనాన్ని సిద్దం చేశారు. పాదయాత్రలో ఏలాంటి ఇబ్బందులు కలగకుండ ముందస్తూ చర్యలుగా 125 హార్స్‌పవర్‌ కలిగిన 3 జనరేటర్లు, సౌండ్‌ సిస్టమ్‌నకు చెందిన 2 వాహనాలు, కళాకారులు ఆటపాట ఆడేందుకు మరో రెండు వాహనాలు, మీడియా ప్రతినిధులకు మరో మూడు వాహనాలు మొత్తం15 వాహనాలను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది.

పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు: ఇప్పటికే ఈ జోడోయాత్రకు సంబంధించి ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ నేతృత్వంలో 12 మందితో కూడిన పర్యవేక్షణ కమిటీని ఏర్పాట్లు చేశారు. ఈ కమిటీ రోజువారీగా, నియోజక వర్గాల వారీగా జోడోయాత్ర పరిశీలకుల నుంచి నివేదికను తీసుకుంటుంది. తరచూ ఈ కమిటీ సమావేశమై యాత్రపై చర్చిస్తుంది. ఎక్కడెక్కడ ఎవరెవరు యాత్రలో పాల్గొంటున్నారని పరిశీలిస్తుంది. నాయకులు పాల్గొనకపోతే ఎందుకు పాల్గొనలేదని తదితర అంశాలపై ఆరా తీస్తుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే కూడా ఈ పర్యవేక్షణ కమిటీతో తరచూ సమావేశమై తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది.

రెండు నెలలు పాటు కొనసాగనున్న యాత్ర: ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వివిధ రూపాల్లో జనంలోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ యత్నిస్తోంది. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ముగిసిన తరువాత ఆ యాత్రకు కొనసాగింపుగా దేశవ్యాప్తంగా రెండు నెలలపాటు హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ చేపట్టాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. ఇప్పటికే జవనవరి 26న లాంఛనంగా ప్రారంభించిన హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర దేశవ్యాప్తంగా రెండు నెలలు కొనసాగనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.